Site icon Prime9

New York: న్యూయార్కులో దారుణం ..మహిళ పై దాడి చేసి.. అత్యాచారం

New York

New York

New York: అమెరికాలోని న్యూయార్కు నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ గొంతుకు బెల్టు వేసి ఈడ్చుకుంటూ ఓ కారు వెనక్కి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన ఘటన సీసీ కెమరాలకు చిక్కింది. ఒళ్లు గగొర్పొరేడ ఈ సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక అసలు విషయానికి వస్తే న్యూయార్కు నగరంలో ఓ మహిళ నడుచుకుంటూ పోతుండగా.. వెనుక నుంచి ఒక వ్యక్తి వచ్చి తన బెల్టును మహిళ మెడపై వేసి ఈడ్చుకుంటూ లాక్కెన దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కాయి. అటు తర్వాత ఆ వ్యక్తి రెండు కార్ల మధ్యన ఆ మహిళపై అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన దృశ్యాలన్నీ సర్వెలెన్స్‌ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే అత్యాచారం చేసిన వ్యక్తి ఎవరో పోలీసులు ఇప్పటికి గుర్తుంచలేకపోయారు. కాగా ఈ సంఘటన మే 1న న్యూయార్కు నగరంలోని బ్రోంక్స్ బరో ఏరియాలో తెల్లవారు జామున 3 గంటలకు జరిగిందని పోలీసులు చెప్పారు. 45 ఏళ్ల యువతి ఆ సమయంలో ఒక్కతే సైడ్‌ వాక్‌ ద్వారా నడుచుకుంటూ వెళుతుండగా.. వెనుక నుంచి ఆగతంకుడు వచ్చి తన బెల్టును ఉండలా చుట్టి ఆమె మెడపైకి వేసి ఈడ్చుకుంటూ వెళ్లడం వీడియోలో కనిపించింది.

మెడకు బెల్టువేసి ఈడ్చుకుంటూ ..(New York)

ఇక సర్వెలెన్స్‌ పుటేజీని బట్టిచూస్తే దాడి చేసిన వ్యక్తి తన ముఖం కనిపించకుండా ముఖానికి తెల్లటి కర్చీఫ్‌ తగిలించుకున్నాడు. కాగా బాధితురాలి మెడకు బెల్టు వేసి ఈడ్చుకుంటూ వెళుతుండగా ఆ మహిళ తన మెడకు వేసిన బెల్టును విడిపించుకోవడానికి విఫలయత్నం చేశారు. అయితే ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లినప్పుడే ఆమె స్పృహతప్పిపోయారు. వెంటనే ఆగంతకుడు ఆమెపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు ఆగంతకుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాగా బాధితురాలిని ఎన్‌వైసీ హెల్త్‌ అండ్‌ హాస్పిటల్స్‌ / లింకన్‌లో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆ మహిళపై దాడి చేయడానికి ముందు ఆమెతో కొద్ది సేపు ఆగంతకుడు మాట్లాడినట్లు చెబుతున్నారు.

న్యూయార్కు పోలీసు డిపార్టమెంట్‌ సమాచారం ప్రకారం అత్యాచారం చేసిన వ్యక్తి చామన చాయ రంగు కలిగి ఉన్నాడని.. ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు ఉండవచ్చునని… బ్లాక్‌ స్వెట్‌షర్ట్‌ వేసుకున్నాడని.. షర్ట్‌ పై GAP అని రాసి ఉన్నాయని తెల్లటి స్వెట్‌ప్యాంట్‌తో పాటు బ్లాక్‌ – రెండ్‌ -వైట్‌ స్నీకర్స్‌ వేసుకున్నట్లు చెప్పారు. కాగా ఎన్‌వైపీడీ స్పెషల్‌ విక్టమ్‌ టీం దర్యాప్తు చేస్తోంది.

Exit mobile version