Nepal PM Prachanda Resigns: నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ శుక్రవారం పార్లమెంటులో తన ప్రభుత్వం పై పెట్టిన అవివిశ్వాస తీర్మానంలో ఓటమి పాలయ్యారు. ప్రభుత్వానికి అనుకూలంగా 63 ఓట్లు రాగా వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (CPN-UML) తన ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకోవడంతో ప్రచండ రాజీనామా చేయవలసి వచ్చింది. నేపాల్ తదుపరి ప్రధానిగా కేపీ శర్మ ఓలీ బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
996 నుండి 2006 వరకు హింసాత్మక మావోయిస్ట్ కమ్యూనిస్ట్ తిరుగుబాటుకుప్రచండ నాయకత్వం వహించారు. దీని ఫలితంగా 17,000 మందికి పైగా మరణించారు. మావోయిస్టులు తమ సాయుధ తిరుగుబాటును విరమించుకున్నారు, 2006లో యునైటెడ్ నేషన్స్ సహాయంతో శాంతి ప్రక్రియలో చేరారు మరియు ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అతను 2008లో ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఒక సంవత్సరం తర్వాత రాష్ట్రపతితో విభేదాల కారణంగా 2016లో రాజీనామా చేశారు. మరలా డిసెంబర్ 2022లో ప్రధానమంత్రి అయినప్పటి నుండి అస్థిరమైన పాలక సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్నాడు, అక్కడ అతని పార్టీ మూడవ స్థానంలో నిలిచింది, కానీ అతను కొత్త కూటమిని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి అయ్యారు. తన సంకీర్ణ అధికారాలలో విభేదాల కారణంగా అతను పార్లమెంటులో నాలుగు సార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇపుడు పార్లమెంట్‌లో తాజాగా ఐదవ అవిశ్వాస తీర్మానంలో ఓటమి చెందారు.
నేపాల్‌లో కొత్త ‘జాతీయ ఏకాభిప్రాయ ప్రభుత్వం’ ఏర్పాటుకు ప్రచండను అధికారం నుండి తొలగించడమే లక్ష్యంగా అర్ధరాత్రి ఒప్పందం జరిగింది. ఓలి మరియు నేపాలీ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ దేవుబా రెండు పార్టీల మధ్య కొత్త రాజకీయ కూటమికి పునాది వేయడానికి కలిశారు, దీని తరువాత ఓలీ యొక్క CPN-UML ప్రచండ నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. ఒప్పందం ప్రకారం, ఓలి ఏడాదిన్నర పాటు కొత్త ‘జాతీయ ఏకాభిప్రాయ ప్రభుత్వానికి’ నాయకత్వం వహిస్తారు. తదుపరి ఎన్నికల వరకు మిగిలిన పదవీకాలానికి నేపాలీ దేవుబా ప్రధానమంత్రిగా ఉంటారు.