Site icon Prime9

NASA: అర్టెమిస్ ప్రయోగం రెండోసారి వాయిదా

Artemis launch postponed

Artemis moon rocket: చంద్రుడికి పైకి నాసా ప్రయోగించ త‌ల‌పెట్టిన మాన‌వ ర‌హిత ఆర్టెమిస్ ఉప‌గ్రహ ప్రయోగం మ‌రోమారు వాయిదా ప‌డింది. అర్టెమిస్‌ను మోసుకెళ్లే ఉప‌గ్రహ వాహ‌క నౌక స్పేస్‌లాంచ్ సిస్టమ్ లో ఇంధ‌నం నింపుతుండ‌గా లీక్ స‌మ‌స్య ఎదురైంది. ఇంజినీర్లు లిక్విడ్ హైడ్రోజ‌న్ లీక్ కాకుండా నివారించ‌డానికి చేసిన ప్రయ‌త్నాలు ఫ‌లించ‌లేద‌ని నాసా ట్వీట్ చేసింది. దీంతో అర్టెమిస్ ఉప‌గ్రహ ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రక‌టించింది. తిరిగి ఎప్పుడు ప్రయోగిస్తారో వెల్లడించ‌లేదు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫ్లోరిడాలోని కెన్నెడి స్పేస్ సెంట‌ర్ నుంచి శ‌నివారం అర్టెమిస్ ఉప‌గ్రహాన్ని ప్రయోగించాల్సి ఉంది. అర్టెమిస్ ప్రయోగం కోసం ఫ్లోరిడా స‌మీప ప్రాంతాలకు చెందిన దాదాపు నాలుగు ల‌క్షల మంది ఆశ‌లు అడియాస‌లు అయ్యాయి. ఫ్యూయ‌ల్ ట్యాంక్ నుంచి లిక్విడ్ హైడ్రోజ‌న్ లీక్ కావ‌డంతోపాటు రాకెట్ నాలుగు ఇంజిన్ల‌లో ఒక‌టి వేడిగా ఉంద‌ని సెన్సర్ గుర్తించింది. తాజాగా అర్టెమిస్ ప్రయోగం వాయిదా ప‌డినందున తిరిగి ఈ నెల 19 వ‌ర‌కు ప్రయోగించే అవ‌కాశాలు లేవ‌ని తెలుస్తోంది.

Exit mobile version