Powerful Passports: 2024 సంవత్సరానికి హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్‌ను బుధవారం నాడు విడుదల చేసింది. వీటిలో జపాన్, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాలకు చెందిన పాస్‌పోర్టులు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులుగా గుర్తించింది. ఈ దేశానికి సంబంధించిన పాస్‌పోర్టులు ఉన్న వారు ప్రపంచంలోని 227 దేశాలకు గాను 194 దేశాలకు ఎలాంటి వీసాలు లేకుండా రాకపోకలు కొనసాగించవచ్చు. అయితే హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్‌లలో ఆసియా దేశాలు కూడా ఈ సారి తమ సత్తా చాటాయని వెల్లడించింది.
ఇక హెన్లీ విషయానికి వస్తే .. గ్లోబల్ రెసిడెన్సీ అండ్ సిటిజన్‌షిఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కన్సెల్టెన్సీ కంపెనీ.. తాజాగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ నుంచి తాజా గణాంకాలను సేకరించి పాస్‌పోర్టు ర్యాంకులను ప్రకటించింది. బలమైన పాస్‌పోర్టు ఉంటే వీసాలేకుండా కొన్ని దేశాలకు చుట్టిరావచ్చు. ఇక ర్యాంకింగ్‌ల విషయానికి వస్తే గత ఐదు సంవత్సరాల నుంచి జపాన్, సింగపూర్‌లు టాప్ ర్యాంకును సాధిస్తూ వస్తున్నాయి. ఈ రెండు దేశాలతో పాటు యూరోపియన్ దేశాలు కూడా టాప్ స్పాట్‌కు చేరాయి.
పాస్ పోర్టుల ర్యాంకింగులు..(Powerful Passports)
ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాల విషయానికి వస్తే నంబర్ వన్ స్థానంలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ కాగా రెండవ స్థానంలో ఫిన్‌లాండ్, దక్షిణ కొరియా, స్వీడెన్‌లు ఆక్రమించాయి. మూడవ స్థానంలో ఆస్ర్టియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నాలుగవ స్థానంలో బెల్జియం, లక్సెంబర్గ్, నార్వే, పోర్చుగల్, యూనైటెడ్ కింగ్‌డమ్‌లు, ఐదవ స్థానంలో గ్రీస్, మాల్టీ, స్విట్జర్లాండ్, ఆరవ స్థానంలో చెక్ రిపబ్లిక్, న్యూజిలాండ్, పోలండ్‌లు, ఏడవ స్థానంలో కెనడా, హంగెరీ, యూనైటెడ్ స్టేట్స్, 8వ స్థానంలో ఈస్టోనియా, లుథునియా, 9వ స్థానంలో లాటివియా, స్లోవేకియా, స్లోవెనియా, పదవ స్థానంలో ఐస్‌లాండ్‌లు నిలిచాయి.
అయితే ప్రపంచంలోనే అందరికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికా పాస్ పోర్టు మాత్రం అంత బలమైంది కాదని తేలిపోయింది. ప్రస్తుతం అమెరికా పాస్‌పోర్టు ఏడవ స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం అమెరికా పాస్‌పోర్టు కలిగిన వారు ప్రపంచంలోని 188 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా చుట్టిరావచ్చు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి అమెరికా పాస్‌పోర్టు ఎనిమిదవ స్థానం నుంచి ఆరవ స్థానానికి మధ్య ఊగిసలాడింది. ఈ ఏడాది ఏడవ స్థానాన్ని ఆక్రమించింది. చివరగా 2014లో అమెరికా పాస్‌పోర్టు నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించి అప్పుడు అమెరికాతో బ్రిటన్ కూడా నెంబర్ వన్ స్థానంలో ఉండేది. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ విషయానికి వస్తే గత దశాబ్ద కాలం నుంచి క్రమంగా బలపడుతూ వస్తోంది. యూఏఈ పాస్‌పోర్టు ఉన్న వారు ఎలాంటి వీసా లేకుండా 106 దేశాలకు వెళ్లిరావచ్చు. కాగా 2014 నుంచి44 స్థానంలో ఉన్న పాస్ పోర్టు కొంత కాలం పాటు 55 స్థానానికి ప్రస్తుతం 11వ స్థానానికి దిగివచ్చింది.ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. అయినా ర్యాంకింగ్‌లో మాత్రం చాలా వెనుబడి ఉంది. ప్రస్తుతం 80వ ర్యాంకులో ఉన్న భారత్ వీసాలేకుండా సుమారు 62 దేశాలను చుట్టిరావచ్చు. ఇండియాతో పాటు ఉజ్బెకిస్తాన్‌కు కూడా 80వ స్థానంలో నిలిచింది. ఇక చైనా విషయానికి వస్తే గణనీయంగా తన ర్యాంకును పెంచుకుంది. 21 ర్యాంకులు మెరుగుపడింది. ప్రస్తుతం 62వ ర్యాంకులోఉంది 85 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా తిరిగి రావచ్చు.మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌ను తీసుకుంటే 101వ స్థానంలో ఉంది. ఇక చైనా విషయనికి వస్తే పాస్‌పోర్టు ర్యాంకింగ్‌లో బాగా వెనుకబడి ఉన్నా.. టాప్ 10 పాస్‌పోర్టు ఇండెక్స్‌లలో ఆసియా దేశాలు గణనీయమైన స్థానంలో ఉన్నాయి.