American Airlines: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మైనర్ బాలికకు చేదు అనుభవం ఎదురయింది. విమానంలో టాయిలెట్ సీటు వెనుక భాగంలో ఐఫోన్ అతికించి ఉండటంతో ఆమె షాక్ అయింది. బాలికను రికార్డ్ చేయడానికే ఫోన్ అక్కడ ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
టాయిలెట్ సీటు వెనుక ఐఫోన్ ..( American Airlines)
సెప్టెంబరు 2 నార్త్ కరోలినాలోని షార్లెట్ నుండి బోస్టన్‌కు వెడుతున్నవిమానంలో 14 ఏళ్ల అమ్మాయికి సిబ్బందిలోని ఒక యువకుడు ఫస్ట్-క్లాస్ బాత్రూమ్‌ను ఉపయోగించమని చెప్పాడు. టాయిలెట్‌ని ఉపయోగించిన తర్వాత, టాయిలెట్ సీటు వెనుక భాగంలో ఐఫోన్‌ను అతికించారని, దానిని రికార్డ్ చేయడానికి పెట్టారని బాలిక గ్రహించింది. ఆమె బాత్రూమ్ నుండి బయలుదేరే ముందు తన స్వంత ఫోన్‌తో దీన్ని చిత్రీకరించింది. బాలిక ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఫిర్యాదు చేసారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత గేట్ వద్ద లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వారిని కలిశారు. సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పందించింది. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నామని ప్రయాణీకుల మరియు సిబ్బంది తమకు అత్యధిక ప్రాధాన్యతలని తెలిపింది. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని, యువకుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.