Mexico Shootings:మెక్సికోలోని ఉత్తర-మధ్య రాష్ట్రమైన గ్వానాజువాటోలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున క్రిస్మస్ సీజన్ పార్టీపై ముష్కరులు దాడి చేయడంతో కనీసం 16 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
పార్టీ ముగిసాక..(Mexico Shootings)
సాల్వాటియెర్రాలోని ముష్కరులు పోసాడా” అని పిలవబడే క్రిస్మస్ పార్టీ తర్వాత ఈవెంట్ హాల్ నుండి బయలుదేరుతుండగా వ్యక్తులపై దాడి చేశారు.మరో ఘటనలో సలామాంకా నగరంలో జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారు. అంతకుముందు డిసెంబర్ 9 న, సెంట్రల్ మెక్సికోలో ఒక క్రిమినల్ ముఠాకు చెందిన ముష్కరులు మరియు ఒక చిన్న వ్యవసాయ సంఘం నివాసితుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది, దీని ఫలితంగా కనీసం 11 మంది మరణించారు. రాజధాని మెక్సికో సిటీకి నైరుతి దిశలో 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్స్‌కల్‌టిట్లాన్ కుగ్రామంలో ఈ ఘర్షణ జరిగినట్లు పోలీసులు తెలిపారు.