Site icon Prime9

Malaysia: మలేసియాలో నేవీ హెలికాప్టర్లు ఢీకొని 10 మంది మృతి

Malaysia: మలేసియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలో ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 10 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

శిక్షణ విన్యాసాలలో..(Malaysia)

మలేసియాలో త్వరలో.. రాయల్‌ మలేసియన్‌ నేవీ దినోత్సవం జరగనుంది. ఇందుకోసం పెరక్‌లోని లుమత్‌ ప్రాంతంలో రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా.. శిక్షణ విన్యాసాల కోసం గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కొద్ది క్షణాలకే ప్రమాదవశాత్తూ ఢీకొని కుప్పకూలాయి. వీటిల్లో ఒకటి స్థానిక స్టేడియంలో కూలిపోగా.. మరొకటి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో ఉన్న 10 మంది సిబ్బంది మరణించారు. వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్‌ కమాండర్లు ఉన్నారు.ఒక ప్రకటనలో, ప్రమాదానికి గురైన విమానంలోని మొత్తం 10 మంది సిబ్బంది మరణించినట్లు నేవీ ధృవీకరించింది, “బాధితులందరూ సంఘటనా స్థలంలో మరణించారని నిర్ధారించారు. గుర్తింపు కోసం లుముట్ ఆర్మీ బేస్ ఆసుపత్రికి పంపామని నేవీ తెలిపింది.

Exit mobile version