Malawi Vice President Plane Crash: మలావి వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న విమానం చికాన్‌గవా పర్వతప్రాంతంలో కుప్పకూలడంతో ఆయనతో పాటు మరోపది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వారిలో చిలిమా భార్య కూడా ఉన్నారని ప్రెసిడెంట్ లాజారస్ చాక్‌వేరా మంగళవారం నాడు వెల్లడించారు. మలావి ప్రెసిడెంట్ విడుదల చేసిన ప్రకటనలో వైస్ ప్రెసిడెంట్ మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలిన ప్రాంతంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. విమానం శఖలాలు కనిపించాయని చెబుతున్నారు. ఏ ఒక్కరు బతికే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కాగా వైస్ ప్రెసిడెంట్ విమానం క్రాష్ గురించి ప్రస్తావిస్తూ.ఎయిర్‌క్రాఫ్ట్ ట్రాక్ రికార్డుతో పాటు అనుభవజ్ఞులైన సిబ్బంది విమానం నడిపారని.. ఎక్కడో లోపం జరిగిందని మలావి ప్రెసిడెంట్ అన్నారు. లైలాంగ్ వే నుంచి తిరుగు ప్రయాణం సందర్భంగా విమానం కుప్పకూలిందని తమను తీవ్ర దు:ఖసాగరం ముంచెత్తిందన్నారు ప్రెసిడెంట్.ఈ విమానంలో ప్రయాణిస్తున్న చిలిమా వచ్చే ఏడాది జరిగే మలావి జనరల్ ఎన్నికల తర్వాత ఆయన ప్రెసిడెన్షియల్ క్యాండిడెంట్‌గా ఖరారు అయ్యారు. కాగా ఆయన ప్రయాణిస్తున్న విమానం సోమవారం నుంచి మిస్సింగ్ అయ్యింది. వాస్తవానికి ఈ విమానం ఎం జుజు విమానాశ్రయంలో 10.02 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే వాతావరణ అనుకూలించకపోవడంతో పైలెట్‌కు ముందు భాగం స్పష్టంగా కనిపించకపోవడంతో విమానం క్రాష్ అయ్యిందని భావిస్తున్నారు.
కాగా ఈ విమానం లైలోన్‌వేకు తిరిగి రావాల్సింది. అయితే ఏవియేషన్ అధికారులకు రాడార్‌లో కనిపించకుండా పోయింది. విమానంతో సంబంధాలు తెగిపోయాయి. అయితే ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ మరణించి ఉంటారని చెప్పారు. మిలిటరీని రంగంలోకి దింపి సహాయ చర్యలను ముమ్మరం చేశామని, మృతదేహాలను రాజధానికి తీసుకురమ్మని ఆదేశించామని చెప్పారు. ఇదిలా ఉండగా సోమవారం నాడు విమానం రాడర్ నుంచి అదృశ్యం అయిన వెంటనే పలు దేశాలు .. వాటిలో అమెరికా కూడా ముందుకు వచ్చి సాంకేతికపరంగా మలావికి సహాయం చేస్తామని ముందుకు వచ్చాయి.
ఇక చిలిమా విషయానికి వస్తే ఆయన వయసు 51 ఏళ్లు. వచ్చే ఏడాది జరిగే మలావి ప్రెసిడెన్షియల్ క్యాండిడెట్ రేసులో ఆయన ముందున్నారు. 2022లో ఆయనపై వచ్చిన ఆరోపణల కారణంగా అరెస్టు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చి పెద్ద ఎత్తున కమిషన్‌లు తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కాగా తనపై వచ్చిన ఆరోపణలను చిలిమా ఖండించారు. అయితే ఆయన వచ్చిన ఆరోపణలను ఈ ఏడాది మేలో నేషనల్ ప్రాసిక్యూటర్ ఉపసంహరించారు.