Site icon Prime9

Los Angeles: హాలీవుడ్‌ నిర్మాత హార్వే వేన్‌స్టీన్‌ కు మరో 16 ఏళ్లు జైలు శిక్ష విధించిన లాస్ ఏంజిల్స్ కోర్టు

Los Angeles

Los Angeles

Los Angeles:హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలపాటు హాలీవుడ్‌లో నిర్మాతగా వెలిగిన హార్వేకు మరో 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. పదేళ్ల కిత్రం యూరోయపిన్‌ నటిపై బెవర్లీ హిల్స్‌ హోటల్‌ గదిలో అత్యాచారానికి పాల్పడినందుకు లాస్‌ ఏంజెల్స్‌ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చింది. ఇప్పటికే లైంగిక వేధింపుల తరహా కేసుల్లో న్యూయార్క్‌లో 23 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న వేన్‌స్టీన్‌ తాజా తీర్పుతో మరో 16 ఏళ్లపాటు అంటే తన జీవితకాలం జైల్లో కాలం గడపాల్సివస్తుంది.

యావజ్జీవ కారాగార శిక్ష విధించవద్దని వేడుకున్న హార్వే వేన్‌స్టీన్‌..(Los Angeles)

వీల్‌చైర్‌లో కోర్టుకు హాజరైన 70 ఏళ్ల  హార్వే వేన్‌స్టీన్ దయచేసి తనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించవద్దని వేడుకున్నాడు. దానికి తాను అర్హుడిని కాదని ఈ కేసులో చాలా లోసుగులు ఉన్నాయని కోర్టుకు విన్నపించాడు. అయితే అతన్ని వాదనలు పట్టించుకొని న్యాయమూర్తి లిసా లెంచ్‌.. అత్యాచారానిక పాల్పడినందుకు మొత్తం 16 సంవత్సరాల పాటు మరో మూడు శిక్షలు విధించారు. కాగా 2013లో నటి, మోడల్‌పై హార్వే వేన్‌స్టీన్‌ అత్యాచారానికి పాల్పడినట్లు గత డిసెంబర్‌లోనే లాస్‌ ఏంజెల్స్‌ కోర్టు నిర్ధారించిన విషయం తెలిసిందే.

మీటూ ఉద్యమానికి దారితీసిన ఆరోపణలు..

బాధితురాలైన నటి వేన్‌స్టీన్‌ను వీలైనంత గరిష్ట శిక్ష విధించాలని కన్నీళ్లతో జడ్జి ముందు వేడుకుంది. అతని స్వార్థపూరితమైన, అసహ్యకరమైన చర్యలు కారణంగా తన జీవితం నాశనం అయ్యిందని కోర్టుకు విన్నవించుకుంది. తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు అతను జీవితాంతం జైల్లోనే ఉన్నా సరిపోదని అన్నారు. ఇదిలా ఉండగా హాలీవుడ్‌లో అగ్రనిర్మాతగా గుర్తింపు పొందిన హార్వే వేన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది హాలీవుడ్‌ నటీమణులు, మహిళలు అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏంజెలీనా జోలీ, సల్మా హయక్‌, జెన్నిఫర్‌ ఐన్‌స్టన్‌ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2017లో ఆయనపై ఈ ఆరోపణలే మీటూ ఉద్యమానికి దారితీసిన విషయం తెలిసిందే.

భయంకరమైన అనుభవం..

2013లో వైన్‌స్టీన్‌చే తనపై అత్యాచారం చేసాడని సాక్ష్యమిచ్చిన యూరోపియన్ మోడల్ జేన్ డో ఆమె కుమార్తెతో పాటు కోర్టుకు హాజరయ్యారు. “10 సంవత్సరాల తరువాత, ఇక్కడ నిలబడటం నాకు చాలా కష్టం, ఎందుకంటే ఈ అత్యాచారం యొక్క ప్రభావాలు ఇప్పటికీ పచ్చిగా ఉన్నాయి మరియు చర్చించడం కష్టం. నేను ఈ బరువును, ఈ గాయాన్ని, ఈ అహేతుకమైన నమ్మకాన్ని చాలా సంవత్సరాలుగా మోస్తున్నాను. అతని స్వార్థపూరితమైన, అసహ్యకరమైన చర్యలు నన్ను మరియు నా జీవితాన్ని బాగా ప్రభావితం చేశాయి, అతను నాకు చేసినది చాలా భయంకరమైనది, అని ఆమె న్యాయమూర్తిని ఉద్దేశించి అన్నారు.

వచ్చే నెలలో 71 ఏళ్లు నిండిన వైన్‌స్టెయిన్ తన జీవితాంతం జైలులోనే గడపాలని గురువారం నాటి శిక్ష నిర్ధారిస్తుంది. అయితే అతని బృందం ఇప్పటికీ వైన్‌స్టీన్ స్వేచ్ఛ కోసం పోరాడుతోంది. లాస్ ఏంజిల్స్ నేరారోపణపై అప్పీల్ చేస్తామని వర్క్స్‌మన్ మరియు జాక్సన్ చెప్పారు. న్యూయార్క్‌లో, రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం అయిన కోర్ట్ ఆఫ్ అప్పీల్స్, అతని 2020 లైంగిక నేరాల నేరారోపణపై వీన్‌స్టీన్ చేసిన అప్పీల్‌ను వినడానికి అంగీకరించింది.

Exit mobile version