International Kissing Day 2023: చిత్ర విచిత్రమైన స్టంట్స్ చేసి అరుదైన రికార్డులను కొల్లగొట్టండి చూస్తూనే ఉంటాం. ఇక అన్నిరికార్డుల్లోకెళ్లా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మరింత ప్రత్యేకం. అలాంటి గిన్నిస్ రికార్డుల్లోకి పేరు ఎక్కించడం అంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి. దానికి చాలా శ్రమపడాల్సి ఉంటుంది కూడా. అయితే ఒకసారి గిన్నిస్ లోకి ఎక్కిన పేరును ఆ తర్వాత ఎవరైనా బీట్ చేస్తే తప్ప తొలగించరు కానీ ఈ రికార్డును మాత్రం స్వయంగా గిన్నిస్ సంస్థ యాజమాన్యమే తొలగించిందంట. మరి ఎందుకు ఆ రికార్డును తొలగించాల్సి వచ్చిందో ఓ సారి చూసేద్దాం.
థాయ్‌లాండ్‌కు చెందిన ఎక్కచాయ్-లక్సానా అనే జంట ఏకంగా 58 గంటల 35 నిమిషాల పాటు సుదీర్ఘమైన ముద్దు పెట్టుకుని ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నారు. రిప్లైవ్ నిర్వహించిన బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ ఘనత సాధించారు. థాయిలాండ్‌లోని పట్టాయాలో 12 ఫిబ్రవరి 2013న ప్రారంభమై ఈ ఈవెంట్ రెండు రోజులు కొనసాగింది. ఇక ఈ పోటీలో తొమ్మిది జంటలు పాల్గొనగా.. దాదాపు అన్ని జంటలు గంటల కొద్ది ముద్దులు పెట్టుకున్నాయి.
చెరిపేసిన గిన్నిస్ రికార్డ్ (International Kissing Day 2023)
కాగా 2012 సంవత్సరంలో ఇద్దరు థాయ్ పురుషులు స్వలింగ సంపర్కులైన నోంథావత్ చారోన్‌కేసోర్న్సిన్-థానకోర్న్ సిథియామ్‌థాంగ్ క్రియేట్ చేసిన రికార్డును (50 గంటల 25 నిమిషాలు) అయితే 2013వ సంవత్సరంలో నాలుగు జంటలు బద్దలు కొట్టాయి. ఇంతకు ముందు 2011లో ఒకసారి రికార్డు సృష్టించిన ఎక్కాచై-లక్సానా జంట.. ఆ రికార్డును తిరగరాసి 2013లో మరోసారి ప్రపంచ నంబర్ వన్ రికార్డు సృష్టించింది. వీరికి 100,000 థాయ్ బాట్ల నగదు (3,300 అమెరికా డాలర్లు), 100,000 భాట్ల విలువైన రెండు డైమండ్ రింగ్‌ల గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నారు.
అయితే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గిన్నీస్ రికార్డులో నమోదైన ఈ రికార్డును చెరిపివేస్తున్నారట. అది కూడా ప్రపంచ ముద్దుల దినోత్సవరం (జూలై 7) రోజునే దీన్ని చెరిపేస్తుండడం గమనార్హం. ఎందుకంటే ఈ ముద్దుల పోటీ చాలా ప్రమాదకరంగా ఉందని, దానికి తోడు కొన్ని నియమాలు తమ ప్రస్తుత విధానాలకు విరుద్ధంగా ఉన్నందున ఇలా చేస్తున్నట్లు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వెల్లడించింది.
ఈ పోటీదారులు అనుసరించాల్సిన రికార్డ్ నియమాలు ఇలా ఉన్నాయి..
* ముద్దు నిరంతరాయంగా ఉండాలి, పెదవులు ఎల్లప్పుడూ తాకాలి. పెదవులు విడిపోతే, ఆ జంట వెంటనే అనర్హులు.
* పోటీదారులు ప్రయత్నించే సమయంలో గడ్డి ద్వారా ద్రవాలను తినవచ్చు, కానీ పెదవులు విడిపోకూడదు.
* జంట ఎల్లవేళలా మెలకువగా ఉండాలి.
* ప్రయత్న సమయంలో పోటీదారులు తప్పనిసరిగా నిలబడాలి. ఎవరి సహాయమూ తీసుకోకూడదు.
* విశ్రాంతి, విరామాలు అనుమతించబడవు.
* అడల్ట్ న్యాపీలు/డైపర్‌లు లేదా ఇన్‌కంటినెన్స్ ప్యాడ్‌లు ధరించకూడదు.
* జంటలు మరుగుదొడ్డి వినియోగించినప్పుడు కూడా ముద్దు పెట్టుకోవడం తప్పనిసరి. ఆ సమయంలో రిఫరీ పర్యవేక్షణలో వారిని ఉంచాలి.