London: టిప్పు సుల్తాన్ గన్ పై బ్రిటన్ కీలక నిర్ణయం

18వ శతాబ్దపు మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన అరుదైన తుపాకీ పై బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. టిప్పు సుల్తాన్ తుపాకీ ఎగుమతిపై నిషేధం విధించింది. ఈ తుపాకీ దేశం దాటి వెళ్లకూడదని పేర్కొంది.

London: 18వ శతాబ్దపు మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన అరుదైన తుపాకీ పై బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. టిప్పు సుల్తాన్ తుపాకీ ఎగుమతిపై నిషేధం విధించింది. ఈ తుపాకీ దేశం దాటి వెళ్లకూడదని పేర్కొంది. ఇండియా, బ్రిటన్ సంబంధాలను అధ్యయనం చేయడానికి విలువైన, అరుదైన ఈ తుపాకీ కీలకం కానుందని తెలిపింది. కాగా, ఈ తుపాకీ విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 20 లక్షలు గా ఉంది. ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ బ్రిటన్ ఉత్తర్వులు జారీ చేసింది.

విలువైన, అరుదైన తుపాకీ గా..(London)

1793-97 కాలానికి చెందిన ఈ గన్ ను ‘ఫ్లింట్లాక్ స్పోర్టింగ్ గన్’ అని పిలుస్తారు. సింగల్ బ్యారెల్ తుపాకీ అయిన దీని నుంచి రీ లోడ్ చేయకుండానే ఒకేసారి రెండు తూటాలు వస్తాయి. ఈ తుపాకీని తయారు చేసిన ‘అసద్ ఖాన్ మహ్మద్’ పేరు కూడా దీనిపై ముద్రించి ఉంటుంది. ఈ గన్ ను అప్పటి జనరల్ కార్స్ వాలిస్ కు బహుమతిగా వచ్చినట్టు బ్రిటన్ చెబుతోంది.

 

వేలంలో భారీ ధర పలికిన ఖడ్గం

కాగా, ఇటీవల లండన్ లో జరిగిన ఓ వేలంలో టిప్పు సుల్తాన్ వాడిన ఓ కత్తిని వేలం వేశారు. ఈ కత్తికి భారీగా ధర పలికింది. ఈ కత్తి సుమారు రూ. 140 కోట్లకు(14 మిలియన్ పౌండ్లు) అమ్ముడుపోయినట్టు వేలం నిర్వహించిన బాన్ హమ్స్ హౌజ్ పలికింది. మామూలుగా అంచనా వేసిన దాని కంటే 7 రెట్లు ఎక్కువ ధరకు ఈ కత్తి అమ్ముడుపోయింది. 18 శతాబ్ధంలో ఎన్నో యుద్దాలను గెలిచిన టిప్పు సుల్తాన్ ఈ ఖడ్గాన్ని వాడినట్టు ఆధారాలు ఉన్నాయని బాన్ హమ్స్ పేర్కొంది.

వేలంలో పోటా పోటీ (London)

1175 నుంచి 1779 వరకు మరాఠాలపై యుద్ధం చేయడానికి ఈ ఖడ్గాన్ని వాడినట్టు బాన్ హమ్స్ చెబుతోంది. టిప్పు సుల్తాన్ మరణం తర్వాత అతని బెడ్ ఛాంబర్ లో ఈ కత్తిని కనుగొన్నారు. అనంతరం బ్రిటీష్ మేజర్ జనరల్ డేవిడ్ బెయిర్డ్ గి అప్పగించినట్టు తెలుస్తోంది. చరిత్రకు సంబంధించిన అత్యంత అద్భుతంగా తయారైన ఖడ్గాల్లో ఇది ఒకటిగా ఉంది. దీంతో కత్తిని పొందడానికి వేలంలో పోటా పోటీ నెలకొంది.

 

‘టైగర్ ఆఫ్ మైసూర్ ’గా టిప్పును పిలుస్తుంటారు. ఆయ‌న త‌న సామ్రాజ్యాన్ని అత్యంత ధైర్య‌సాహాసాలు ప్ర‌ద‌ర్శించి ర‌క్షించుకున్నాడు. యుద్ధాల స‌మ‌యంలో రాకెట్ ఆర్టిల్ల‌రీ వాడేవాడు. అయితే సైనికులు మోసం చేయడం వల్ల టిప్పు మరణం సాధ్యమైందని చరిత్ర చెబుతోంది. మేని ఛాయతో, తక్కువ ఎత్తు, పెద్దవైన కళ్లతో టిప్పుు సుల్తాన్ ఉండేవారని.. ప్రసిద్ధ కళాకారుడు కల్నల్ మార్క్ విల్క్ ఓ పుస్తకంలో వెల్లడించారు.