Libya Floods: లిబియాను వణికించిన డేనియల్ తుఫానుతో మృతిచెందిన వారి సంఖ్య సుమారు ఐదు వేలకు చేరింది. పది వేలమంది వరకు ఆచూకీ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. లిబియాకు తూర్పు తీర ప్రాంతం నగరమైన డెర్నాలో నాలుగోవంతు నగరం తుడిచిపెట్టుకుపోయింది. డెర్నా నగరానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లడుతూ 2,000 మంది చనిపోయరని చెబుతుండగా.. స్థానిక టెలివిజ్ మాత్రం మృతుల సంఖ్య ఐదువేల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. డెర్నా నగరం విషయానికి వస్తే ఈ నగరం జనాభా 1,25,000. భారీ వరదలకు నగరంలోని భవనాలు కొట్టుకుపోయాయి. ఇక కార్ల విషయానికి వస్తే కార్లు కూడా కొట్టుకుపోయాయి. నగరంలోని వీధులన్నీ బురదమయం అయ్యాయి. స్థానిక వాహదా హాస్పిటల్ డైరెక్టర్ ఒకరు మాట్లాడుతూ.. నగరానికి చెందిన రెండు జిల్లాలో ఒక జిల్లాలో 1,700 మంది చనిపోగా.. మరో జిల్లాలో 500 మంది చనిపోయారని చెప్పారు. హాస్పిటల్ కారిడార్‌లో మృతుల నేలపై పడుకొబెట్టిన దృశ్యాలు కనిపించాయి. కాగా తప్పిపోయిన వారి బంధువులు ఆస్పత్రికి వచ్చి తమ వారు ఉన్నారా లేదా అని చూసి వెళ్లిపోతున్నారు..
ఎక్కడ చూసినా మృతదేహాలే ..(Libya Floods)
లిబియాలో ఎక్కడ చూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. అది సముద్రం కానీ. వ్యాలీ కానీ.. భవనాల్లో కానీ ఎక్కడ చూసినా మృతదేహాలే కనిపిస్తున్నాయని పౌర విమానయానశాఖ మంత్రి హైచెమ్ అబు చికిఔట్ చెప్పారు.. డెర్నా నగరంలోని నాలుగో వంతు మాయమైంది నగరంలోని పలు భవనాలు కుప్పకూలిపోయాయి. కాగా స్థానిక టెలివిజన్ అల్ – మసేర్ సమాచారం ప్రకారం ఇంటిరియర్ మనిస్టర్ మాత్రం మృతుల సంఖ్య 5,000 కంటే పై చిలుకే ఉంటుందని చెప్పారని టీవీ న్యూస్ వెల్లడించింది. ఇక లిబియాకు తూర్పు ప్రాంతంలో అతి పెద్ద నగరాల్లో రెండవదైన బెంగ్‌జాయ్ విషయానికి వస్తే ఈ నగరం కూడా వరదలకు అతలాకుతలం అయ్యింది. రెడ్ క్రాస్‌కు చెందిన చీప్ ఒకరు మాట్లాడుతూ.. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఆయన వీడియో లింక్ ద్వారా మాట్లాడుతూ… మిస్సింగ్ పర్సన్ పదివేల కంటే ఎక్కువగా ఉండవచ్చునని చెప్పారు. ఇదిలా ఉండగా ఐక్యరాజ్యసమితి హ్యుమానిటేరియన్ ఏఫైర్స్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీం రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టింది.
భారీ వరదలతో అతలాకుతలం అయిన లబియాను ఆదుకునేందుకు టర్కీ రంగంలోకి దిగింది. సెర్చి, రెస్యూ వెహికిల్స్‌ను, రెస్క్యూ బోట్స్, జనరేటర్స్, ఆహారంతో డెర్నా నగర పౌరులకు అందించేందుకు దిగింది. తప్పిపోయిన వారిని గాలించేందుకు తమ వంతు సహాయ సహకారాలందిస్తోంది.డెర్నా నదికి 1942 నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు భారీ వరదలు ముంచెత్తాయి. కాగా డ్యామ్‌కు తరచూ మెయిన్‌టెనెన్స్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భారీ వరదలకు చెరువులకు గండ్లు పడి నగరాలు కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.