Pakistan: పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీని శుక్రవారం బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ హత్యలో స్థానిక ప్రత్యర్థి గ్రూపుల హస్తం మరియు ఎల్‌ఇటిలోని అంతర్గత పోరు వుందని పాకిస్తాన్ నిఘా ఏజెన్సీలు భావిస్తున్నాయి.
అక్రమ్ ఘాజీ పాకిస్థాన్‌లో భారత వ్యతిరేక ప్రసంగాలకు ప్రసిద్ధి చెందాడు. లష్కరే తోయిబాలో కీలక వ్యక్తి . ఘాజీ చాలా కాలంగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డాడు. అతను ఇంతకుముందు 2018 నుండి 2020 వరకు లష్కరే తోయిబా రిక్రూట్‌మెంట్ సెల్‌కు నాయకత్వం వహించాడు. ఇది తీవ్రవాదుల పట్ల సానుభూతిగల వ్యక్తులను గుర్తించడానికి మరియు రిక్రూట్ చేయడానికి బాధ్యత వహించే ముఖ్యమైన విభాగం.ఘాజీ హత్య ఇటీవల లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల్లో మూడవ హత్య కావడం విశేషం. సెప్టెంబరులో, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావల్‌కోట్‌లోని అల్-ఖుదుస్ మసీదులో లష్కరే తోయిబాకు చెందిన టాప్ టెర్రరిస్టు కమాండర్‌ను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. ఉగ్రవాదిని రియాజ్ అహ్మద్ అలియాస్ అబు ఖాసిమ్‌గా గుర్తించారు.అక్టోబర్‌లో పఠాన్‌కోట్ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్ లతీఫ్ ను పాకిస్థాన్‌లో కాల్చి చంపారు.