King Charles 3 coronation: బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 పట్టాభిషేకం అట్టహాసంగా నిర్వహించారు. శనివారం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది. 1953 తర్వాత బ్రిటన్ లో ఇదే తొలి పట్టభిషేకం. ఈ కార్యక్రమంలో ఛార్లెస్ కు రాజకుటుంబ సంప్రదాయాలతో కిరీట ధారణ చేశారు. కిరీట ధారణ అవ్వగానే.. అక్కడకు అతిథులంతా ‘గాడ్ సేవ్ కింగ్ ’ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత పట్టాభిషేక కుర్చీలోంచి లేచి.. రాజ ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని ప్రత్యేకంగా చేయించిన సింహాసనంపై ఆసీనులయ్యారు.
అంతకుముందు తర్వాత చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్ ప్రమాణం చేశారు. తర్వాత చర్చి ఆఫ్ ఇంగ్లాండ్ కు నమ్మకస్థుడైన ప్రోటెస్టెంట్ క్రిస్టియన్ గా ఉంటానని ఛార్లెస్ ప్రమాణం చేశారు. భారత్ తరపున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ఆయన సుదేశ్ ధన్ ఖడ్ లు పాల్గొన్నారు. సుమారు 100 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ పట్టాభిషేకానికి విచ్చేశారు.