Site icon Prime9

S Jaishankar: కేంద్ర మంత్రి జైశంకర్‌పై దాడి.. పోలీసుల అదుపులో ఖలిస్థానీ మద్దతుదారుడు!

Khalistani extremist attack to S Jaishankar’s security in London: లండన్ పర్యటనలో భారత విదేశాంగ మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. దీంతో ఆయనపై ఖలిస్థానీ వాదులు దాడికి యత్నించారు.

లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో థింక్ ట్యాంకు వద్ద జరిగిన ఓ సమావేశంలో విదేశాంగ మంత్రి జై శంకర్ పాల్గొని తిరిగి కారులో వెళ్తుండగా.. కొంతమంది ఖలిస్థానీ అనుకూల తీవ్రవాదుల బృందం ఆయనను అడ్డుకునేందుకు వచ్చారు. భద్రతా ఉల్లంఘన జరగడంతో కారు వైపు దూసుకొచ్చారు. అనంతరం భారతీయ జాతీయ జెండాను అవమానించేలా చేశారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటన జరిగిన అనంతరం భద్రతా సిబ్బందిపై జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇంత పెద్దగా ఖలిస్థానీ పరులు విధ్వంసం సృష్టించేందుకు వచ్చినా అక్కడ ఉన్న పోలీసులు, అధికారులు స్పందించకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకొని ఓ వ్యక్తి జైశంకర్ కాన్వాయ్‌పైకి దూసుకొచ్చినట్లు వీడియోలో రికార్డైంది. అనంతరం ఓ వ్యక్తి జాతీయ పతాకాన్ని అవమానించేలా చేయడంతో పాటు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదిలా ఉండగా, భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. మార్చి 4వ తేదీన లండన్ పర్యటనకు వెళ్లారు. కాగా, ఆయన లండన్‌ పర్యటన మార్చి 9వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగానే బ్రిటన్ విదేశాంగ మంత్రితో జైశంకర్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఇరు దేశాల సహకారం, వాణిజ్యపరమైన చర్చలు ఎడ్యుకేషన్, సాంకేతికత, రాజకీయ రంగాల్లో సహకారం వంటి అంశాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు చర్చించారు. అనంతరం ‘ప్రపంచంలో భారతదేశ వృద్ధి, పాత్ర‘ అంశంపై జైశంకర్ మాట్లాడారు.

Exit mobile version
Skip to toolbar