Prime9

Kenya : కెన్యాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ప్రవాస భారతీయుల దుర్మరణం

Kenya Accident : కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఖతర్‌లో నివాసం ఉంటున్న ఐదుగురు ప్రవాస భారతీయులు దుర్మరణం చెందారు. విషయాన్ని ఖతర్‌లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది.

 

28 మంది ప్రవాస భారతీయులు కెన్యా పర్యటన..
ఖతర్‌లో నివాసం ఉంటున్న 28 మంది ప్రవాస భారతీయులు కెన్యా పర్యటనకు వెళ్లారు. బస్సులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. తమకు అందిన సమాచారం ప్రకారం.. ఐదుగురు మ‌ృతిచెందారు. హెచ్‌సీఐ నైరోబికి చెందిన అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ పేర్కొంది. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని ఎంబసీ వెల్లడించింది.

 

మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బస్సు అదుపు తప్పి లోయలో పడిందని మరికొన్ని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. బస్సు అదుపు తప్పి లోయలో పడిందా..? లేక వేరే వాహనం ఢీకొట్టిందా అనేది ఇంకా తెలియరాలేదు.

Exit mobile version
Skip to toolbar