Pakistan Supreme Court: పాకిస్తాన్ సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వేతనాలు అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, మంత్రులు, సమాఖ్య కార్యదర్శులు మరియు పార్లమెంటేరియన్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సమర్పించిన నివేదిక వెల్లడించింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తరువాతే..(Pakistan Supreme Court)
అత్యధిక వేతనం పొందడంలో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి మొదటి స్థానంలో ఉన్నారు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు రెండవ స్థానంలో ఉన్నారు, అధ్యక్షుడు మూడవ స్థానంలో ఉన్నారు మరియు ప్రధానమంత్రి మంత్రులు మరియు సమాఖ్య కార్యదర్శుల కంటే తక్కువ జీతం పొందుతారు. పాకిస్తాన్ అధ్యక్షుడి జీతం 896,550 పాకిస్తానీ రూపాయలు కాగా ప్రధానమంత్రి 201,574 జీతం పొందుతారు. అదే సమయంలో, పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి 1,527,399 కాగా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల జీతం1,470,711 మరియు ఫెడరల్ మంత్రుల జీతం 338,125 గా ఉందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వెల్లడించింది. పార్లమెంట్ సభ్యుడి జీతం 188,000, గ్రేడ్-22 అధికారి 591,475 జీతం అందుకుంటారు.
పాక్ సుప్రీంకోర్టు కూడా జవాబుదారీ..
పాకిస్తాన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ మంగళవారం నాడు అత్యున్నత న్యాయస్థానం యొక్క 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఖర్చుల ఆడిట్ కోసం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు హాజరు కాలేదు. వచ్చే మంగళవారం జరగనున్న సమావేశానికి ఆయనను కమిటీ మళ్లీ పిలిపించి, హాజరుకాకపోతే వారెంట్లు జారీ చేస్తామని కమిటీ హెచ్చరించింది.పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ ప్రిన్సిపల్ అకౌంటింగ్ ఆఫీసర్ పబ్లిక్ అకైంట్స్ కమిటీ ముందు హాజరుకాకపోతే, మిగిలిన సంస్థలు ఎందుకు జవాబుదారీగా ఉంటాయని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ నూర్ ఖాన్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు అకౌంట్ల ఆడిట్ వ్యవహారం విచారణలో ఉందని, పీఏసీ పరిధిలోకి రాదని, కమిటీ ముందు హాజరు కావాల్సిన అవసరం లేదని రిజిస్ట్రార్ లేఖ రాశారని చెప్పారు.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ మరియు ఎన్నికల సంఘం మరియు ఇతర సంస్థలు తమ ఖాతాలన్నింటికి ఈ కమిటీకి జవాబుదారీగా ఉంటాయని పాకిస్తాన్ సుప్రీం కోర్టు ఎందుకు జవాబుదారీగా ఉండకూడదని ఆయన అడిగారు.