DNA Test for Dogs: ఉత్తర ఇటలీ ప్రావిన్స్ అన్ని కుక్కలకు డీఎన్ఏ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించింది, వీధుల్లో పెంపుడు కుక్కల విసర్జితాలను శుభ్రం చేయడంలో విఫలమైతే వాటి యజమానులను కనుగొని జరిమానా విధించే ప్రయత్నంలో ఉంది.కుక్క డీఎన్ఏ సేకరించిన తర్వాత, పరీక్ష ఫలితాలు డేటాబేస్‌లో చేర్చబడతాయి. ఇది కుక్క యజమానులను ట్రేస్ చేయడానికి ఉపయోగిస్తారు.
డేటాబేస్, జన్యుపరంగా పరీక్షించిన తర్వాత ఇటాలియన్ ప్రావిన్స్‌లోని వీధుల్లో ఎవరి కుక్క మల విసర్జన చేసిందో తనిఖీ చేయడానికి బోల్జానోలోని స్ట్రీట్ క్లీనర్‌లు మరియు ఆరోగ్య అధికారులు యాక్సెస్ చేస్తారు. తరువాత యజమానులు గుర్తించి వీరికి 50 నుండి 500 యూరోల ($54 నుండి $540) వరకు జరిమానాలను విధిస్తారు.ప్రావిన్స్‌లోని 40,000 కుక్కలకు డీఎన్ఏ పరీక్షలు చేయవలసి ఉంది.తమ కుక్క కోసం డీఎన్ఏ ప్రొఫైలింగ్‌ను తిరస్కరించిన యజమానులకు 292 నుండి 1,048 యూరోలు ($318 నుండి $1179) మధ్య జరిమానా విధించబడుతుంది. డేటాబేస్ రోడ్డు ప్రమాదాలలో లేదా ఇతర జంతువులు లేదా వ్యక్తులపై దాడి చేసిన కుక్కలను గుర్తించడానికి కూడా ఉపయోగించబడుతుంది.