Israeli Air Strike: దక్షిణ గాజాలోని పాఠశాల వెలుపల శరణార్దుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 29 మంది మరణించగా పలువురు గాయపడినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.ఖాన్ యూనిస్ నగరానికి తూర్పున ఉన్న అబాసన్ అల్-కబీరా పట్టణంలోని అల్-అవుదా పాఠశాల గేటు పక్కన మంగళవారం ఈ దాడి జరిగిందని గాజా హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
పాఠశాలలపై దాడులు సరికాదు..(Israeli Air Strike)
అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిలో పాల్గొన్న హమాస్ మిలిటరీ విభాగానికి చెందిన తీవ్రవాదిని” లక్ష్యంగా చేసుకోవడానికి పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని ఉపయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. పాఠశాలకు ఆనుకుని ఉన్న పౌరులకు హాని జరిగినట్లు వచ్చిన నివేదికలను పరిశీలిస్తున్నట్లు కూడా తెలిపింది. ఇలా ఉండగా ఈ దాడిని యూరోపియన్ యూనియన్ మరియు జర్మనీ ఖండించాయి.పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్న వ్యక్తులు చంపబడటం ఆమోదయోగ్యం కాదని జర్మన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ X లో ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ సైన్యం పాఠశాలలపై పదేపదే దాడులు ఆపాలని డిమాండ్ చేసారు.అబాసన్ అల్-కబీరా మరియు తూర్పు ఖాన్ యూనిస్‌లోని ఇతర ప్రాంతాలను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైన్యం పౌరులను ఆదేశించిన వారం తర్వాత ఈ సంఘటన జరిగింది.