Israel launches airstrikes on Gaza: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. మంగళవారం తెల్లవారుజామున మొదలైన భీకర దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 342 మంది పాలస్తీనీయులు మరణించినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే, తమ దేశానికి చెందిన మిగిలిన 59 మంది బందీలను విడుదల చేయకపోతే గాజాపై దాడులు మరింత ముమ్మరం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హమాస్ గ్రూపును హెచ్చరించారు. అంతకుముందు, సీజ్ ఫైర్‌పై చర్చల్లో పురోగతి లేదని, అందుకే రెట్టింపు మిలిటరీతో దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు తెలిపారు. ఇదిలా ఉండగా, గత 17 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే 48వేల మంది పాలస్తీనీయులు మరణించారు.
ఇదిలా ఉండగా, గాజాలో ప్రభుత్వ మీడియా ఆఫీసు విడుదల చేసిన ప్రకటనలో ఇజ్రాయెల్ ఆర్మీకి క్రూరమైన హత్యలు చేయడం తప్పవేరే తెలియదు. వారికి తెలిసిన భాష ఒక్కటే చంపడం..విధ్వంసం సృష్టించడం.. నరమేథం సృష్టించడం అని ప్రకటనలో ఆరోపించింది. తాజా దాడులతో వారి అసలు ఉద్దేశం బయటపడింది. అమాయకుల ప్రాణాలను తీసింది. ఇజ్రాయెల్‌కు అసలు నైతికతేలేదు. న్యాయం ధర్మం అనేది వారు పట్టించుకోరు. పసిపిల్లలను, మహిళలను కూడా వదలకుండా చంపుతున్నారు. వారి వాలకం చూస్తే రక్తం రుచి మరినట్లు కనిపిస్తోందని హమస్ మీడియా సెల్ ప్రకటనలో వివరించింది. కాగా ఇరువర్గాల మధ్య రెండవ దశ కాల్పుల విరమణ డీల్ కుదరాల్సి ఉంది. ఒకవేళ కాల్పలు విరమణ ఒప్పందం కుదిరితే హమాస్ చెరలో ఉన్న 60 మంది ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలి. కాగా ఇజ్రాయెల్ చెప్పేది ఏమిటంటే మొదటి దశ కాల్పలు విరమణ ఏప్రిల్ రెండవ వారం వరకు కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది.
కాగా హమాస్ మొత్తం ఇప్పటి వరకు 36 మంది బందీలను విడుదల చేసింది. బదులుగా ఇజ్రాయెల్ 2వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే ఇజ్రాయెల్‌మాత్రం కాల్పుల ఒప్పందం ముగిసిందని ఎక్కడచెప్పకపోయినా.. గాజాపై దాడులు యధాతథంగా కొనసాగుతయని చెప్పింది. ఇజ్రాయెల్ రక్షణమంత్రి కాట్జ్‌మాట్లాడుతూ.. హమాస్ చేతిలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయకపోతే.. నరకం తలుపులు తెరిచి ఉంచుతామని హెచ్చరించారు. ఇజ్రాయెల్ బందీలు క్షేమంగా ఇంటికి చేరుకొనే వరకు తమ దాడులు కొనసాగుతాయన్నారు కాట్జ్. అలాగే తమ లక్ష్యం నెరవేరే వరకు యుద్ధం కొనసాగుతుంన్నారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ చెప్పేది ఏమటంటే మధ్యవర్తలు పలు ప్రతిపాదనలు హమాస్ ముందు పెడితే వాటిని నిర్ద్వందంగా తిరస్కరిస్తోందని ఆరోపిస్తోంది. దీంతో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మొదలుకావాల్సిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహు తిరస్కరించారని ఇజ్రాయెల్ తమ చర్యను సమర్థించుకుంటోంది.