Site icon Prime9

Israel-Hamas War: ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి విరామం..నేడు బందీల మొదటి బ్యాచ్ విడుదల

Israel-Hamas war

Israel-Hamas war

 

Israel-Hamas War:ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధానికి కాస్తా విరామం లభించింది. ఖతార్‌ మధ్యవర్తిత్వం అమల్లోకి వచ్చింది. వాస్తవానికి గురువారం నుంచి కాల్పుల విమరణ అమలు కావాల్సి ఉండగా.. కొన్ని సాంకేతిక పరమైన అంశాల వల్ల శుక్రవారానికి వాయిదా పడింది. ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్‌ 39 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది. వారిలో 24 మంది మహిళలు 15 టీనేజ్‌ బాయ్స్‌ ఉంటారని పాలస్తీనా అధికారులు తెలిపారు. కాగా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం మాత్రం నాలుగు రోజుల్లో హమాస్‌ మొత్తం 240 బందీల్లో కనీసం 50 మందిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన వెంటనే గాజా పౌరులు తమ పిల్లలు, కుటుంబాలతో కలిసి కార్లలో, గుర్రపు బగ్గీల్లో ఏ రవాణా సాధానం దొరికితే దాంట్లో తమ ఇళ్లకు చేరుకున్నారు. గాజా రోడ్లన్నీశుక్రవారం కిక్కిరిసి పోయాయి. నగరంలోని రోడ్లని ట్రాఫిక్‌ జాం అయ్యాయి. అంబులెన్స్‌ సైరన్లతో ట్రాఫిక్‌ జాంల మధ్య నుంచి ఆస్పత్రులకు వెళతున్న దృశ్యాలు కనిపించాయి. గత ఏడు వారాల నుంచి ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి యూఎన్‌ ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లోతలదాచుకున్నారు. అయితే శుక్రవారం నుంచి ఖాన్‌ యూనస్‌ ప్రాంతంలో ఎలాంటి కాల్పుల శబ్దాలు వినిపించలేదు.

మానవతాసాయానికి అనుమతి..(Israel-Hamas War)

ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌కు చెందిన ఐడీఎఫ్‌ మాత్రం శుక్రవారం ఉదయం నాలుగు ఇంధన టాంకర్లను, వంటగ్యాస్‌ను ఈజిప్టునుంచి దక్షిణ గాజాలోని యూనైటెడ్‌ నేషన్‌ హ్యూమానిటేరియన్‌ ఎయిడ్‌కు తరలించడానికి అనుమతించామన్నారు. కాగా బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ కెమెరాన్‌ శుక్రవారం మధ్య ప్రాచ్యదేశాల పర్యటనకు వెళ్లారు. పాలస్తీనానాయుకలతో సమావేశం అయ్యి గాజా పౌరులకు 30 మిలియన్‌ పౌండ్ల ఎయిర్‌ ఇవ్వడానికి అంగీకరించారు. ఖాతర్‌ విజయవంతంగా మధ్య వర్తిత్వం నిర్వహించినందకు బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ అభినందించారు.

గాజాలో హమాస్‌ చెరలో ఉన్న తమ ఆప్తుల విడుదల కోసం బందీల కుటుంబ సభ్యులు టెల్అవీవ్లో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తమ దేశంలోని జైళ్ల నుంచి విడుదల కావడానికి అర్హతలు కలిగిన 300 మంది పాలస్తీనా ఖైదీల జాబితాను ఇజ్రాయెల్‌ న్యాయ శాఖ బహిర్గతం చేసింది. వీరిలో చాలామంది యువకులే ఉన్నారు. గత ఏడాది కాలంలో వీరంతా అరెస్టయ్యారు. రాళ్లు విసరడం, చిన్నచిన్న నేరాలకు పాల్పడడం వంటి కారణాలతో ఇజ్రాయెల్‌ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. 50 మంది బందీలను హమాస్‌ విడుదల చేస్తే, ఒప్పందం ప్రకారం 150 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ విడుదల చేయాల్సి ఉంటుందని చర్చలు జరిగాయి.

Exit mobile version