Prime9

Iran- Israel War Effect: ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో ఎయిర్ పోర్టులు క్లోజ్!

West Asian Countries Airports Closed due to Iran- Israel War: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఎక్కడికక్కడ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. తాజాగా టెహ్రాన్ ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా టెల్ అవీస్ దాడులకు పాల్పడింది. దాడుల్లో విమానాశ్రయంలోని ఎఫ్ 14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. అయితే దాడులకు సంబంధించి వీడియోలను డిఫెన్స్ ఫోర్సెస్ షేర్ విడుదల చేసింది. టెహ్రాన్ ఎయిర్ పోర్ట్ పై దాడి చేశామని తెలిపింది. తాజాగా జరిపిన దాడులపై ఇజ్రాయెల్ వివరణ ఇచ్చింది. ఇరాన్ తమపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉందనే సమాచారంతో జెట్ విమానాలను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది.

 

మరోవైపు ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులతో టెహ్రాన్ విడిచి వెళ్లాలని ఆయా దేశాలు తమ పౌరులకు సూచిస్తున్నాయి. మరోవైపు భారత్ కూడా అక్కడ చదివే విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కాగా పశ్చిమాసియాలో తాజాగా నెలకొన్న పరిస్థితులతో పలు దేశాలు ఎయిర్ పోర్టులను మూసివేశాయి. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఖతార్, కువైట్, ఒమన్, లెబనాన్, యూఏఈ దేశాలు విమానాశ్రయాలను మూసివేశాయి. కాగా విమానాల నిలిపివేతతో వేలాది మంది ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. అలాగే ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గగనతలంపై కూడా ఆంక్షలు విధించాయి.

 

 

Exit mobile version
Skip to toolbar