Indonesia:ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో చైనా యాజమాన్యంలోని నికెల్ ప్లాంట్‌లో సంభవించిన పేలుడు కారణంగా 13 మంది కార్మికుల మరణించగా పులువురు గాయపడినట్లు పోలీసులు మరియు తెలిపారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని పిలవబడే చైనా యొక్క ప్రతిష్టాత్మకమైన బహుళజాతి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇండోనేషియాలోని నికెల్ స్మెల్టింగ్ ప్లాంట్లలో జరిగిన ఘోరమైన ప్రమాదాలలో ఇది తాజాది.
38 మందికి గాయాలు ..(Indonesia)
మృతుల్లో ఐదుగురు చైనీస్ మరియు ఎనిమిది మంది ఇండోనేషియా కార్మికులు ఉన్నారు. ఫర్నేస్ మరమ్మతులు చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా పేలడంతో వారు మరణించారని సెంట్రల్ సులవేసి పోలీసు చీఫ్ అగస్ నుగ్రోహో తెలిపారు.సుమారు 38 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని నుగ్రోహో చెప్పారు.సంస్థ నిర్లక్ష్యమే మరణాలకు దారితీసిందా అని నిర్ధారించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని నుగ్రోహో తెలిపారు.రెస్క్యూ సిబ్బంది మంటలను ఆర్పివేసి దాదాపు నాలుగు గంటల ఆపరేషన్ తర్వాత కార్మికులను ఖాళీ చేయించారు. ఫర్నేస్ దిగువన పేలుడు ద్రవాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇవి సమీపంలోని ఆక్సిజన్ సిలిండర్లలో మంటలు మరియు పేలుడును ప్రేరేపించిందని తెలిసింది.
సులవేసి ప్రావిన్స్‌లోని చైనీస్ యాజమాన్యంలోని నికెల్ స్మెల్టింగ్ ప్లాంట్‌లో ఈ ఏడాది జరిగిన మూడో ఘోర ప్రమాదం ఇది. ఏప్రిల్‌లో నికెల్ వ్యర్థాలను పారవేసే ప్రదేశం కూలిపోవడంతో ఇద్దరు డంప్ ట్రక్కు ఆపరేటర్లు మరణించారు.జనవరిలో, ఉత్తర మొరోవాలి రీజెన్సీలో ఇండోనేషియా-చైనా జాయింట్ వెంచర్‌లో కార్మికులు మరియు సెక్యూరిటీ గార్డుల మధ్య అల్లర్లలో ఒక చైనా జాతీయుడితో సహా ఇద్దరు కార్మికులు మరణించారు.2019 నుండి సెంట్రల్ సులవేసి ప్రావిన్స్‌లోని నికెల్ స్మెల్టింగ్ ప్లాంట్లలో చైనా మరియు ఇండోనేషియాకు చెందిన 22 మంది కార్మికులు మరణించారని మైనింగ్ అడ్వకేసీ నెట్‌వర్క్ తెలిపింది.