Site icon Prime9

Sunita Williams: అంతరిక్ష కేంద్రంలో డ్యాన్స్ చేసిన సునీతా విలియమ్స్

Sunita Williams

Sunita Williams

Sunita Williams: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ఇంటర్నేషనల్‌ స్పెస్‌ స్టేషన్‌లో స్టార్‌లైనర్‌ మిషన్‌తో జత కట్టారు. బోయింగ్‌ స్టార్‌లైనర్‌ను సునీతా విలయమ్స్‌తోపాటు బుచ్‌ విల్‌మోర్‌లను అంతరిక్షంలో నడుపనున్నారు. అయితే సునీతా విలయమ్స్‌ మహిళా పైలెట్‌గా ఈ స్పెస్‌ క్రాఫ్ట్‌ టెస్ట్‌కు ఎంపికయ్యారు.

ఇది మూడవసారి..(Sunita Williams)

గతంలో విలియమ్స్‌ అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు తన వెంట గణేశుడి చిన్న విగ్రహంతో పాటు భగవత్‌ గీతాను తీసుకువెళ్లారు. కాగా సునీతా విలియన్స్‌ ఇంటర్నేషనల్‌ స్పెస్‌ సెంటర్‌ నుంచి స్పెస్‌లోకి వెళ్లడం ఇది మూడవసారి. అయితే గురువారంనాగు విలయమ్స్ ఇంటర్నేషనల్‌ స్పెస్‌ స్టేషన్‌ నుంచి వ్యోమనౌకలో ప్రవేశించినప్పడు స్వల్పకాలం పాటు డ్యాన్స్‌ చేసి తన మిత్రులతో కలిసి ఆలింగనం చేశారు. అయితే ఐఎస్‌ఎస్‌ సంప్రదాయం ప్రకారం సునీతా విలియమ్స్‌ను విల్‌మోర్‌ను స్పెస్‌క్రాఫ్ట్‌లోకి వెళ్లిన వెంటనే గంట మోగించి స్వాగతించారు. అయితే సునీతా విలియమ్స్‌తో పాటు విల్‌మోర్‌లు మొట్టమొదటిసారి స్టార్‌లైనర్‌లో ప్రయాణిస్తున్నారు. వీరిద్దరు విజయవంతంగా ఐఎస్‌ఎస్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి బోయింగ్‌ స్పెస్‌క్రాఫ్‌లోకి ప్రవేశించారు. ఫ్లోరిడాలోని కేప్‌ కానావెరెల్‌ స్పెస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ వీరి స్పెస్‌క్రాఫ్‌ లాంచింగ్‌ కావాల్సి ఉంది.

కాగా నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు స్టార్‌లైన్‌ మానిటర్‌ చేస్తుంటారు. క్రమంగా వీరి స్పెస్‌ క్రాఫ్ట్‌ను కక్ష్యలోకి తీసుకువస్తారు. ప్రస్తుతం సాంకేతిక కారణాల వల్ల లాంచింగ్‌ ఆలస్యం అవుతోందని చెబుతున్నారు. సాంకేతిక ఇబ్బందుల విషయానికి వస్తే హీలియమ్‌ స్వల్పంగా లీక్‌ అవుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంటర్నేషనల్‌ స్పెస్‌ సెంటర్‌ కు ఎంపిక కావాలంటే పలు పరీక్షలు నెగ్గాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్పెస్‌లో స్టార్‌లైనర్‌ నడపాలంటే సుమారు వారం రోజుల పాటు స్పెస్‌లో గడపాల్సి ఉంటుంది. పలు పరీక్షలతో పాటు కొన్ని సైంటిఫిక్‌ పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుంది.

Exit mobile version