Maryam Nawaz: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పార్టీలో రిక్షాలో సరిపడేటంత సభ్యులు మాత్రమే ఉన్నారని పీఎంఎల్ నాయకురాలు నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ సెటైర్లు వేసారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని షుజాబాద్‌లో జరిగిన యువజన సమ్మేళనాన్ని ఉద్దేశించి మరియం నవాజ్ మాట్లాడుతూ ఈ రోజు అతను పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, చీఫ్ ఆర్గనైజర్ మరియు అధికార ప్రతినిధి మరియు తన పార్టీ అభ్యర్థి మాత్రమే అని అన్నారు.
మే 9 హింసాకాండ నేపథ్యంలో ఫిరాయింపుల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ మొత్తం “క్వింగ్కీ రిక్షా”లో పడుతుందని ఆమె అన్నారు. “నేను మీకు చెప్తాను… అతని 26 ఏళ్ల పోరాటాన్ని కూల్చివేయడానికి కేవలం 26 నిమిషాలు పట్టింది. ఇప్పుడు అతను జమాన్ పార్క్‌లో ఒంటరిగా కూర్చుంటాడు. అతనిని విడిచిపెట్టిన నాయకులందరూ ఎక్కడికో వెళ్లిపోయారని పేర్కొన్నారు. పాక్ ఆర్మీ ఖాన్ కాళ్ల ముందు దాసోహం కావాలని గట్టి ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. దీంతో పాక్ ఆర్మీ ఇమ్రాన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి గద్దె దించింది. ప్రస్తుతం ఆయన ప్లాన్ అంతా బెడిసికొట్టింది. ప్రస్తుతం బిక్కు బిక్కు మంటూ జమాన్ పార్కులో ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
పాక్ మిలిటరీకి వ్యతిరేకంగా ఇమ్రాన్ తిరుగుబాటు చేశారు. ప్రస్తుతం ఖాన్ పని అయిపోయింది. ఇక దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతుందన్నారు మరియం. దేశానికి నిజమైన శత్రువు ఎవనైనా ఉన్నారంటే అది ఒక్క ఇమ్రాన్ ఖాన్ అని అమె అన్నారు. ఇమ్రాన్‌పార్టీకి చెందిన నాయకులపై మిలిటరీ ఉక్కుపాదం మోపింది. దీంతో సుమారు 100 మంది పీటిఐ నాయకులు పార్టీ ఫిరాయించారు. ఖాన్ సహచరుడు బిలియనీర్ జహంగీర్ తరీన్ కొత్తగా ప్రారంభించిన ఇస్తేకాం పాకిస్తాన్ పార్టీ (ఐపీపీ)లో చేరిపోయారు డజన్ల కొద్ది పిటిఐ నాయకులు .. షరీన్ మజారీ, ఫవాద్ చౌదరీ, అమీర్ మహ్మద్ ఖియానీ, అలీ జైదీలు పార్టీని వీడారు. అలాగే పార్టీ పదవులకు అసద్ ఉమర్, పర్వేజ్ ఖట్టక్‌లు రాజీనామా చేశారు.
పార్టీ నుంచి సీనియర్ నాయకులు వెళ్లిపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని, తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఒక్కడినే పోరాడుతానని అంటున్నారు ఖాన్. కాగా ఖాన్ మద్దతుదారులు ఆర్మీ అమరవీరుల స్థూపాలను ధ్వంసం చేశారు. వారిని దేశం క్షమించదని మరియం అన్నారు. కాగా ఇమ్రాన్‌ఖాన్ ఇద్దరు కుమారులు బ్రిటన్‌లో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు. అయితే మీ పార్టీలో ఉన్న పేద పార్టీ కార్యకర్తలను శిక్షణ ఇచ్చి మిలిటరీ సంస్దలపై దాడులకు ప్రోత్సహించారు. మీరు లాహోర్‌లోని జమాన్ పార్కులో కూర్చుని మీ స్టేట్‌మెంట్లు రికార్డు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసి ప్రసారం చేస్తున్నారు. జైళ్లలో మగ్గుతున్న మీ కార్యకర్తల తల్లులు జైళ్ల బయట కూర్చుని తమ పిల్లల విడుదల కోసం కన్నీరు మున్నీరువుతున్నారు. ఇదేమీ న్యాయం అని ఇమ్రాన్‌ను నిలదీశారు మరియం.