Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
పాకిస్థాన్ లో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో(Pakistan By Polls) ఆయన ఒక్కడే 33 స్థానాల్లో పోటీ చేయనున్నారు.
జాతీయ అసెంబ్లీలో ఖాళీ అయిన 33 స్థానాలకు మార్చి 16 న ఉపఎన్నికలు జరుగునున్నాయి.
అయితే ఆ స్థానాల్లో అన్నింటిలోనూ పీటీఐ తరపున ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఒక్కరే పోటీ చేస్తారని పీటీఐ పార్టీ ఉపాధ్యక్షుడు షా మహమూద్ ఖురేషీ వెల్లడించారు.
పీటీఐ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
ముందస్తు ఎన్నికల విషయంలో అధికార పార్టీపై మరింత ఒత్తిడి పెంచేందుకే పీటీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
గత ఏడాది జాతీయ అసెంబ్లీ లో జరిగిన అవిశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఓటమి అనంతరం అసెంబ్లీ సభ్యులు రాజీనామా చేయాలని తమ పార్టీ ఎంపీలకు ఇమ్రాన్ ఖాన్ సూచించారు. అయితే , ఆ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ ఒకేసారి ఆమోదం తెలపలేదు.
దశల వారీగా రాజీనామాలను ఆమోదించిన అనంతరం.. తాజాగా 33 స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.
పాక్ అసెంబ్లీ పదవి కాలం ఈ ఆగష్టుతో ముగియనుంది. అక్కడి నుంచి 90 రోజుల్లోగా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది.
అయితే అంతకు ముందే ఎలక్షన్ పెట్టాలని పీటీఐ పట్టుబడుతోంది.
గతంలోనూ 7 స్థానాల్లో పోటీ
ఇమ్రాన్ ఖాన్ ఒకేసారి ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయడం ఇది తొలిసారి కాదు. గద ఏడాది అక్టోబర్ లో కూడా జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి.
అందులో కూడా ఇమ్రాన్ ఖాన్ 7 స్థానాల్లో పోటీ చేసి 6 చోట్ల గెలుపొందారు. పాకిస్థాన్ ఎన్నికల నియమావళి ప్రకారం.. ఒక వ్యక్తి ఎన్ని చోట్ల నుంచైనా పోటీ చేసే వీలు ఉంటుంది.
కానీ, ఎక్కువ స్థానాల్లో గెలిచిన సందర్భంలో ఏ స్థానాలను వదలుకుంటారో ఎన్నికల సంఘానికి వెల్లడించాల్సి ఉంటుంది.
ఉపఎన్నికల్లో పాల్గొనం: అధికార పార్టీ
మరో వైపు అధికార పాకిస్థాన్ డెమొక్రటిక్ మూవ్ మెంట్ కూటమి ఉపఎన్నికల్లో పాల్గొనమని ప్రకటించింది. ఇదే నిర్ణయం కొనసాగితే పీటీఐ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుంది.
ఉప ఎన్నికలు జరుగబోయే 33 స్థానాల్లో పంజాబ్ ప్రావిన్స్‌లో 12 స్థానాలు, సింధ్ ప్రావిన్స్‌లో 9, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో 8, ఇస్లామాబాద్ లో 3 స్థానాలు,
బలూచిస్థాన్ ప్రావిన్స్ లో 1 స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/