Site icon Prime9

Imran Khan Bail: అల్‌ ఖదీర్‌ ట్రస్టు కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు

Imran Khan Bail

Imran Khan Bail

 Imran Khan Bail: పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఇస్లామాబాద్‌ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అల్‌ ఖదీర్‌ ట్రస్టు కేసులో ఖాన్‌కు రెండు వారాల పాటు బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు.  మంగళవారం నాడు ఇదే ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రాంగణం నుంచే ఖాన్‌ ను నేషనల్‌ అకౌంటబిలిటి బ్యూరో బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లింది. కాగా నిన్న పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు చట్ట విరుద్దమని.. వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. వెను వెంటనే ఇస్లామాబాద్‌ కోర్టులో హాజరై.. కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని ఖాన్‌కు సూచించింది పాక్‌ సుప్రీం ధర్మాసనం.

మే17 వరకు అరెస్టు చేయవద్దు.. (Imran Khan Bail)

ఇస్లామాబాద్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ జస్టిస్‌ మియాగుల్‌ హసన్‌ ఔరంగజేబ్‌, జస్టిస్‌ సమాన్‌ రాఫత్‌ ఇమితియాజ్‌లు కోర్టు రూం.2లో ఖాన్‌ బెయిల్‌ విచారణ చేపట్టారు. అయితే బెయిల్‌ ఆర్డర్‌ కాపీ రాకముందే ఆయన కోర్టునుంచి బయటికి వెళ్లిపోయారు. దీనితో పాటు ఖాన్‌ను ఇస్లామాబాద్‌ జ్యూరిడిక్షన్‌ కింద నమోదైన కేసుల్లో మే 9వ తేదీ నుంచి మే17 వరకు అరెస్టు చేయరాదని పోలీసులను ఆదేశించింది కోర్టు. కోర్టు విచారణ సందర్భంగా జస్టిస్‌ ఔరంగజేబ్‌… ఖాన్‌ను తన అరెస్టు తర్వాత దేశంలో చెలరేగిన హింసను ఖండిస్తారా అని ప్రశ్నించారు. దీనికి ఖాన్‌ న్యాయవాది విచారం వ్యక్తం చేస్తున్నామని.. ఖండిస్తున్నామని చెప్పారు. దీనికి జస్టిస్‌ ఔరంగజేబ్‌ ఖాన్‌ను ఇదే విషయం లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని కోరారు. కాగా ఇస్లామాబాద్‌ హైకోర్టులో ఖాన్‌ విచారణ రెండు గంటల పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి కారణం విచారణ జరిగే కోర్టు రూంను భద్రతా దళాలు అణువణువు గాలించిన తర్వాత విచారణ ప్రారంభమైంది.

శుక్రవారం ప్రార్థనల కోసం మధ్యాహ్నం 1.00 గంటకు విచారణ నిలిపేసింది. కోర్టు ప్రాంగణంలో ఇమ్రాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వెంటనే న్యాయమూర్తులు వెళ్లిపోయారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ ప్రారంభమైంది. కోర్టు రూంలో ఇమ్రాన్‌ తరపున వాదించడానికి ఖ్వాజా హారీస్‌ లీగల్‌ బృందం వాదనలు వినిపించింది. ఖాన్‌ న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ.. నేషనల్‌ అకౌంటబిలిటి బ్యూరో (న్యాబ్‌) చర్యలు చట్ట వ్యతిరేకమని వాదించారు. ముందుగా న్యాబ్‌ అధికారికంగా విచారణ జరిపిన తర్వాత అరెస్టు వారెంట్‌ జారీ చేయాలన్నారు. న్యాబ్‌ మీడియాలో వచ్చిన వార్తల అధారంగా విచారణ జరిపిందన్నారు. కాగా పిటిఐ చీఫ్‌ ఈ నెల 9వ తేదీన ఇస్లామాబాద్‌ కోర్టుకు న్యాబ్‌ రిపోర్టు కోసం వచ్చినప్పుడు కోర్టులో ప్రవేశించడానికి ముందే అరెస్టు చేశారని న్యాయస్థానం ముందు రెస్టుకు దారి తీసిన పరిణామాలను కోర్టుకు కళ్లకు కట్టినట్లు వివరించారు.

ఇదిలా ఉండగా విచారణ తర్వాత కోర్టు ఇమ్రాన్‌ బెయిల్‌ పిటిషన్‌కు ఆమోదం తెలిపింది. నాబ్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌తో పాటు ఇమ్రాన్‌ లాయర్‌ వచ్చే విచారణకు సిద్దంగా ఉండడని కోరింది. తదుపరి విచారణలో ఇమ్రాన్‌ఖాన్‌ బెయిల్‌ను రద్దుచేయడమా లేక పొడిగించడమే తేలిపోతుందని కోర్టు తెలిపింది. కోర్టు బెయిల్‌ ఇచ్చిన వెంటనే కోర్టు ప్రాంగణంలో వేలాది మంది ఖాన్‌ మద్దతుదారులు గుమిగూడి సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.

Exit mobile version