Site icon Prime9

Ice Cream: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్.. ధరెంతో తెలిస్తే గుండె జారుడే

Ice Cream

Ice Cream

Ice Cream: ఐస్ క్రీమ్ అంటేనే నోరూరిపోతుంటుంది కదా. బయట భానుడు భగభగమంటున్నాడు. ఈ వేడిలో ఒక ఐస్ క్రీమ్ తింటే ఆ మజానే వేరు. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండని వారు ఉండరేమో. చాలామంది ఎన్నో రకాల ప్లేవర్స్ ట్రై చేసి ఉంటారు. అయితే సాధారణంగా ఒక ఐస్ క్రీమ్ ధర ఎంత ఉంటుంది. మహా అయితే 500 లోపు దొరుకుతాయి. అయితే జపాన్ చెందిన ఓ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్ క్రీమ్ ను తయారు చేసింది. మరి ఆ ఐస్ క్రీమ్ విశాలేంటో చూడండి.

 

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు(Ice Cream)

జపాన్ కు చెందిన ఓ ప్రముఖ ఐస్ క్రీమ్ ఉత్పత్తుల తయారీ సంస్థ ‘బైకుయా’ పేరుతో ప్రపంచంలోనే అత్యంత కాస్ట్ లీ ఐస్ క్రీమ్ తయారు చేసింది. అంతేకాకుండా ఈ ఐస్ క్రీమ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకుంది. ఈ ఐస్ క్రీం అంత కాస్ట్ లీ ఎందుకంటే.. అందులో వాడిన పదార్థాలే కారణం. ప్రొటీన్ రిచ్ గా తయారైన ఈ ఐస్ క్రీమ్ లో రెండు రకాల చీజ్, గుడ్లు, సాక్ లీక్ పదార్థాలను ఉపయోగించారు. వీటిని పాలతో తయారు చేసిన వెల్వెట్ బేస్ లో (కోన్ ) ఉంచుతారు. ఈ మిశ్రమంపై మరో రకమైన చీజ్, అత్యంత అరుదుగా దొరికే వైట్ ట్రపుల్, ట్రపుల్ ఆయిల్, తినే బంగారు రేకులతో గార్నిష్ చేస్తారు.

 

ప్రత్యేకంగా మెటల్ స్పూన్

ఈ ఐస్ క్రీమ్ బాగా సాఫ్ట్ గా ఉండటమే కాకుండా సరికొత్త రుచిని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇంతటి స్పెషల్ ఐస్ క్రీమ్ ను తినేందుకు ప్రత్యేకంగా ఓ మెటల్ స్పూన్ ను డిజైన్ చేసింది కంపెనీ. పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రాల నిర్మాణంలో వాడే పద్దతులు, సామగ్రితో ఆ స్పూన్ ను తయారు చేశారు. ఇందులో ఉపయోగించే వైట్ ట్రపుల్ చాలా ప్రత్యేకమైందట. అది ఇటలీలో దొరుకుతుంది. అక్కడి నుంచే సేకరించారు. ఈ ఐస్ క్రీమ్ తినే రెండు నిమిషాల ముందు ఫ్రిజ్ నుంచి బయటకు తీయాలని కంపెనీ సూచించింది. కొన్ని పదార్థాలతో కలిపి ఈ బైకుయా తీసుకుంటే ఆ రుచికి తిరుగు ఉండదని చెప్పింది. పదార్థాల లిస్ట్ ను తయారు చేసింది. ఈ ఐస్ క్రీమ్ కు ఎక్స్ పైరీ డేట్ లాంటిది ఉండవని.. కానీ, 10 రోజుల్లోపు తింటే ఐస్ క్రీమ్ రుచి తాజాగా ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఇలా ఎన్నో విశేషాలున్న ఈ ఐస్ క్రీమ్ ధర చెప్పలేదు కదా. 130 మిల్లీ మీటర్ల ‘బైకుయా’ ధర సుమారు రూ. 5 లక్షలు. అవును మరి ప్రపంచంలోనే ఖరీదైంది అంటే ఆ మాత్రం ఉండాలి కదా.

 

 

Exit mobile version