Site icon Prime9

Cambodia : కాంబోడియా క్యాసినోలో భారీ అగ్ని ప్రమాదం.. 25 మంది మృతి..

Cambodia

Cambodia

Cambodia : కాంబోడియాలోని ఓ క్యాసినోలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కనీసం 25మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మంటల నుంచి తప్పించుకోవడానికి జరిగిన తొక్కిసలాటలో మరి కొంత మంది చనిపోయి ఉంటారని రెస్యూ టీం పేర్కొంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. కాగా ప్రమాదం కాంబోడియాలోని పోయిపెట్‌ నగరంలోని గ్రాండ్‌ డైమండ్‌ సిటి హోటల్‌ క్యాసినోలో చోటు చేసుకుంది. కంబోడియా .. థాయిలాండ్‌ సరిహద్దులో ఉన్న ఈ నగరంలో బుధవారం అర్ధరాత్రి ఈ అగ్ని ప్రమాదం జరిగింది.

కాంబోడియా సమాచారశాఖ డైరెక్టర్‌ సెక్‌ సోకోమ్‌ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 25 మృతి దేహాలను వెలికితీశామని చెప్పారు. అయితే మృతుల సంఖ్యమరింత పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని ఆయన అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రెస్యూ టీ మంటలు చెలరేగిన కాంప్లెక్స్‌ లోపలికి చేరుకులేకపోయారని అన్నారు. థాయి రెస్యూ గ్రూపునకు చెందిన ఓ వాలంటరీ ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. బుధవారం తెల్లవారు జామున రెండు గంటలకు తమ రెస్యూ బృందం వచ్చిందని.. అప్పటికే భవనం పైనుంచి ప్రజలు దూకడం ప్రారంభించారని చెప్పారు.

క్యాసినోలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం… దట్టమైన పొగ నుంచి తప్పించుకోవడానికి ప్రజలు అటు ఇటు పరుగులు తీయడం తాను చూశానని థాయి వలంటీర్‌ చెప్పారు. మంటల నుంచి తప్పించుకోవడానికి కొంత మంది అప్పటికే కిక్కిరిసిపోయిన రూఫ్‌టాప్‌ మీదకు ఎక్కారని, అక్కడి నుంచి దూకడం చూశానని అతను చెప్పాడు. షోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోను బట్టి చూస్తే.. భవనం మొత్తం మంటలు చుట్టుముట్టాయి. ఫైర్‌ ఫైటర్స్‌ మంటలను అదుపు చేయడానికి చాలా కష్టపడ్డారు.

Exit mobile version