Site icon Prime9

Mexico Earthquake: మెక్సికోలో ఒక్కసారిగా దద్దరిల్లిన భూమి… పరుగులు తీసిన ప్రజలు

earthquake in Mexico

earthquake in Mexico

Earthquake: మెక్సికోలో ఒక్కసారిగా భూమి దద్దరిల్లింది. మెక్సికో సెంట్రల్ పసిఫిక్ తీరంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది.

కాగా ఈ భూ ప్రకంపనలు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సోమవారం 1:05 గంటల సమయంలో భూకంపం వచ్చింది. మెక్సికోలోని మిచోకాన్ తీరం వెంబడి సునామీ వచ్చే ఛాన్స్‌ ఉందని అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ వెల్లడించింది.

భూకంపం ధాటికి చాలా భవనాలకు నష్టం వాటిల్లింది. ఓడరేవు నగరమైన కొలిమాలోని మంజానిల్లోలో ఒక మాల్ వద్ద గోడ కూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ ట్వీట్లో తెలిపారు. భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న కోల్‌కోమన్, మైకోకాన్‌లో భవనాలు పగుళ్లువచ్చి బాగా దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో జనాలు భయంతో పరుగులు పెట్టారు. అయితే, భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి భారీ నష్టం జరుగలేదని మెక్సికో సిటీ మేయర్‌ క్లాడియా షీన్‌బాయ్‌ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు.

ఇదీ చదవండి: Taiwan Earthquake: తైవాన్ లో భూకంపం.. భవనాలు నేలమట్టం

Exit mobile version