Site icon Prime9

Philippines: కిలో చికెన్ కన్నా.. ఉల్లిపాయల ధర మూడింతలు ఎక్కువ.. ఎక్కడో తెలుసా?

Philippines

Philippines: ఉల్లి ధర ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు ఉల్లిధర.. రూపాయికి పడిపోతే.. మరికొన్ని సార్లు వీటి ధర ఆకాశాన్ని తాకుతుంది. కానీ ఓ దేశంలో మాత్రం ఉల్లిధర ఆకాశాన్నితాకుతుంది. అక్కడ లభించే మాంసం ధర కన్నా మూడు రెట్లు ఎక్కువ ధర ఉల్లిపాయలకే పలుకుతుంది. ఇంతకి అది ఎక్కడ అంటారా?. ఫిలిప్పిన్స్‌ దేశంలో ఈ పరిస్థితి తలెత్తింది. ఉల్లి కొరతతో ఆదేశంలో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. సుమారు కిలో ఉల్లి ధర రూ. 700 కు పైగా పలుకుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా చాలా వంటల్లో ఉల్లిపాయను తప్పనిసరి వినియోగిస్తారు. కొన్ని దేశాల్లో ఉల్లి తక్కువ ధరకే లభిస్తుంది.

కానీ ఫిలిప్పిన్ లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ఇక్కడ ఉల్లిధర దాదాపు 11 డాలర్లు.. రూ. 800 పైగా ఉంది.

కానీ ఇక్కడ చికెన్ మాత్రం.. రూ. 4 డాలర్లకే దొరుకుతుంది. స్పెయిన్ వలస పాలనతో.. ఉల్లిపాయలు.. వెల్లుల్లిలకు ఇక్కడి వంటలతో అనుబంధం ఏర్పడింది.

దీంతో ఫిలిప్పిన్స్ ఆహార అలవాట్లపై స్పెయిన్ ప్రభావం చూపింది.

కనీస వేతనం కన్న ఉల్లిపాయల ధర ఎక్కువ

ఫిలిప్పీన్స్‌లో (Philippines) గత నెల రోజుల నుంచి.. ఉల్లిపాయలు సామాన్యూలకు అందడం లేదు.

ఉల్లిపాయలతో పాటు కూరగాయల ధరలకు కూడా రెక్కలొచ్చాయి.

ఈ దేశంలో కేజీ ఉల్లిపాయల (Onion Price) ఇప్పుడు రూ. 800పైగా ఉంది.

అంటే సుమారు 11 డాలర్లు.. కానీ ఇక్కడి ప్రజల కనీస వేతనం మాత్రం 9 డాలర్లు మాత్రమే.

అంటే వీరి కనీస ఆదాయం కన్న ఇప్పుడు ఉల్లిపాయల ధర ఎక్కువ అన్నట్లు.

ప్రస్తుతం ఈ దేశంలో ఎక్కడా చూసిన.. ఉల్లిపాయల కొరత తీవ్రంగా వేధిస్తోంది.

ఏ రెస్టారెంట్ కి వెళ్లినా ఉల్లిపాయలు వద్దు.. అనే సంకేతం కనిపిస్తుంది.

ఇటీవలే ధరలు తగ్గినప్పటికి.. ఉల్లిపాయలు పేదలకు విలాసవంతమైన వస్తువుగానే కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు రోజుకు మూడు నుండి నాలుగు కిలోల ఉల్లిపాయలు కొనుగోలు చేసేవారు.. ప్రస్తుతం అరకిలో కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారు.

ఈ నెల ప్రారంభంలో.. ఉల్లిపాయల దిగుమతిని ఆమోదించిన అది అంతగా ప్రభావం చూపడం లేదు.

ఫిలిప్పీన్స్ ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం ఉల్లి ధర ప్రభావితం చేస్తుందని చెప్పాలి.

ధరలు అధికంగా పెరగడంతో.. ఉల్లిపాయలను అక్రమంగా తరలిస్తున్న వారిని అధికారులు పట్టుకుంటున్నారు.

బట్టల వ్యాపారం పేరుతో చైనా నుంచి వీటిని అక్రమంగా తరలించి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.

ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఫిలిప్పీన్స్ వాసులు ట్వీట్లు చేస్తున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వమే కారణమని వారు ఆరోపిస్తున్నారు.

సౌదీ అరేబియా వెళ్లి వస్తున్నప్పుడు చాక్లెట్లకు బదులు ఉల్లిపాయలు తీసుకొచ్చాం అని ఓ వినియోగదారుడు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

దేశంలోని ప్రధాన రెస్టారెంట్లలో ఉల్లిపాయలు వేసిన వంటకాలు ఎక్కువ ధర ఉంటున్నాయి. కొన్నిచోట్ల ఉల్లిపాయలే లేకుండా వంటలు చేస్తున్నారు.

Newlyweds April Lyka Biorrey and Erwin Nobis.

ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయి?

ఈ దేశంలో ఉల్లిధరల పెరుగుదలకు రెండు కారణాలు ఉన్నాయి.

ఈ ఏడాది అవసరమైనదానికంటే ఉల్లిపాయల దిగుబడి తక్కువగా ఉండటం.
ప్రభుత్వం వేసిన అంచనా కంటే మరింత తక్కువగా దిగుబడి రావడం.
ఈ దేశంలో ఆగస్టు, సెప్టెంబర్ లో వచ్చిన తుఫాన్ కూడా ఓ కారణం.

ఇతర దేశాల నుంచి ఉల్లిపాయల దిగుమతులు కూడా లేటుగా జరిగాయి.
ధరలు పెరిగిన తర్వాతే దిగుమతులకు అనుమతి ఇచ్చారు.

ప్రభుత్వ వైఫల్యం..

ఈ పరిస్థితికి దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ కారణమని ఆ దేశ ప్రజలు అంటున్నారు.

వ్యవసాయశాఖ పదవి ఆయన దగ్గరే పెట్టుకోవడం కూడా సమస్యకు దారితీసింది.

ఈ రంగంలో దేశాధ్యక్షుడికి ఎలాంటి అనుభవం లేదని ప్రజలు అంటున్నారు.

2016 నుంచి భారీగా పెరిగిన ఉల్లిపాయల దిగుమతి.

భారత్, చైనా, నెదర్లాండ్స్ లాంటి దేశాల నుంచి ఇక్కడికి దిగుమతి అవుతుంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar