Site icon Prime9

California: కాలిఫోర్నియాలో హిందూ దేవాలయం గోడలపై ఖలిస్థానీ అనుకూల నినాదాలు

California

California

California: అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ దేవాలయం గోడలను ఖలిస్థానీ అనుకూల నినాదాలతో నింపారు. ఈ ఘటన నెవార్క్ నగరంలో చోటుచేసుకుంది.స్వామినారాయణ మందిర్ గోడలపై రాసి ఉన్న నినాదాలను చూపిస్తూ, హిందూ అమెరికన్ ఫౌండేషన్ X లో చిత్రాలను షేర్ చేసుకుంది.

భారత్,మోదీ వ్యతిరేక నినాదాలు..(California)

ఆలయ గోడపై భారత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ద్వేషపూరిత నినాదాలు చిత్రీకరించారు.ఈ సంఘటనను ద్వేషపూరిత నేరంగా పరిశోధించాలని ఫౌండేషన్ డిమాండ్ చేసింది. నెవార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ సివిల్ రైట్స్ డివిజన్‌కు దీని గురించి సమాచారం అందించామని చెప్పారు.విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ సంఘటనపై మాట్లాడుతూ తీవ్రవాదులు మరియు వేర్పాటువాదులకు చోటు ఇవ్వరాదని అన్నారు. అక్కడి మా కాన్సులేట్ ప్రభుత్వానికి మరియు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరుగుతోందని జైశంకర్ విలేకరులతో అన్నారు.

శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ స్వామినారాయణ్ మందిర్ గోడలపై రాతలను ఖండించింది. కాలిఫోర్నియాలోని నెవార్క్‌లోని శ్రీ స్వామినారాయణ మందిరాన్ని భారతదేశ వ్యతిరేక గ్రాఫిటీతో పాడుచేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఘటన భారతీయ సమాజం మనోభావాలను దెబ్బతీసింది. ఈ విషయంలో అమెరికా అధికారులు త్వరితగతిన విచారణ జరిపి, విధ్వంసకారులపై సత్వర చర్యలు తీసుకోవాలని మేము ఒత్తిడి చేసాముఅని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ సామాజిక మాధ్యమం X లో రాసింది.అమెరికాలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి కాదు. పొరుగున ఉన్న కెనడాలోనూ ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు జరిగాయి. కెనడాలోని సర్రే నగరంలో ఒక ఆలయం గోడలపై అర్ధరాత్రి తీవ్రవాదులు ద్వేషపూరిత రాతలు రాసారు. అంతేకాదు ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణాన్ని ఎత్తిచూపుతూ ఆలయ ప్రధాన ద్వారంపై బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్లు అతికించారు.

Exit mobile version
Skip to toolbar