Site icon Prime9

Helicopter crash: అప్గనిస్తాన్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలి ముగ్గురి మృతి

Helicopter-crashes-in-Afghanistan

Afghanistan: అప్గనిస్తాన్‌లోని కాబూల్‌ సైనిక శిక్షణా విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమెరికా తయారు చేసిన బ్లాక్‌హాక్‌ ఛాపర్‌ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అనుభవం లేని ఒక తాలిబన్‌ పైలెట్‌ ఆ అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన సంభవించింది. సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగనట్లు తాలిబన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

ఈ ఛాపర్‌ని శిక్షణా విమానంగా పేర్కొంది. అయితే మంత్రిత్వశాఖ అదనంగా ఐదుగురు చనిపోయారని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి అమెరికా 2002 నుంచి 2017 మధ్య సుమారు రెండు లక్షల కోట్లు విలువైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నైట్‌ విజన్‌ పరికరాలు, విమానాలు, నిఘా వ్యవస్థలతో సహా అఫ్గాన్‌ ప్రభుత్వానికి రక్షణాయుధాలను పంపింది. ఇటీవలే అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా నిష్క్రమించింది. అనుభవం లేని పైలెట్ల చాపర్లు కుప్పకూలుతున్నాయి.

Exit mobile version
Skip to toolbar