Brazil Rains: బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో కుండపోత వర్షం మరియు తుఫాను కారణంగా ఏర్పడిన గాలుల కారణంగా కనీసం 21 మంది మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పట్టణంలోని 85 శాతం వరదలు ముంచెత్తడంతో వందలాది మంది ప్రజలను మ్యూకమ్‌లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
24 గంటల్లోపే 300 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం రాష్ట్రాన్ని తాకింది. వరదలతో కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.రియో గ్రాండే డో సుల్ గవర్నర్ ఎడ్వర్డో లైట్ పరిస్థితిని రాష్ట్రంలో ఎన్నడూ లేని వాతావరణ విపత్తుగా పేర్కొన్నారు. మ్యూకం పట్టణం మనకు తెలిసినట్లుగా అది ఉనికిలో లేదని మేయర్ మాటియస్ ట్రోజన్ స్థానిక మీడియాతో చెప్పారు. పలువురు వ్యక్తులు గల్లంతయ్యారని వారి ఆచూకీ తెలియవలసి ఉందన్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.
వరదల కారణంగా సంబంధాలు తెగిపోయిన ప్రాంతాలకు చేరుకోవడానికి సహాయక సిబ్బంది హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు.ఫిబ్రవరిలో, బ్రెజిల్‌లోని సావోపాలో రాష్ట్రంలో వరదలు మరియు కొండచరియలు విరిగిపడటంతో కనీసం 40 మంది మరణించారు. గత సంవత్సరం రెసిఫే నగరం సమీపంలో కుండపోత వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటం మరియు బురద ప్రవాహాల కారణంగా సుమారు 100 మంది మరణించారు.