Israeli Military: హమాస్ ఆయుధాల ఉత్పత్తి విభాగం కమాండర్ ను హతమార్చిన ఇజ్రాయెల్ మిలటరీ

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) బుధవారం నాడు గాజాలో తాము నిర్వహించిన వైమానిక దాడులలో హమాస్ ఆయుధాల ఉత్పత్తి విభాగానికి నాయకుడిగా వ్వయహరిస్తున్న కమాండర్ ను హతమార్చినట్లు తెలిపింది. ఐడిఎఫ్ ఫైటర్లు గాజా స్ట్రిప్‌లో Xఉగ్రవాదులను నిర్మూలించడం మరియు తీవ్రవాద స్దావరాలపై దాడి చేయడానికి విమానాలను ప్రయోగించాము.

  • Written By:
  • Updated On - November 8, 2023 / 07:37 PM IST

Israeli Military:ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) బుధవారం నాడు గాజాలో తాము నిర్వహించిన వైమానిక దాడులలో హమాస్ ఆయుధాల ఉత్పత్తి విభాగానికి నాయకుడిగా వ్వయహరిస్తున్న కమాండర్ ను హతమార్చినట్లు తెలిపింది. ఐడిఎఫ్ ఫైటర్లు గాజా స్ట్రిప్‌లో Xఉగ్రవాదులను నిర్మూలించడం మరియు తీవ్రవాద స్దావరాలపై దాడి చేయడానికి విమానాలను ప్రయోగించాము. ఇంటెలిజెన్స్ ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఒక ఐడిఎఫ్ ఫైటర్ జెట్ హమాస్ ఆయుధాల విభాగానికి అధిపతిగా పనిచేసిన అబూ జినా ఆయుధాల గిడ్డింగిని ధ్వంసం చేసి అతడిని హతమార్చిందని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో తెలిపారు.

ఆయుధ విభాగానికి నాయకుడు.. (Israeli Military)

ఇజ్రాయెల్ సైన్యం ప్రకారం, అబూ జినా హమాస్ కోసం ఆయుధాల ఉత్పత్తిలో పాల్గొన్న వారిలో ఒకరు.ముఖ్యంగా వ్యూహాత్మక మందుగుండు సామగ్రి మరియు రాకెట్లలో ప్రత్యేకత కలిగి ఉన్నారు. అతను హమాస్ పరిశ్రమలు మరియు ఆయుధ విభాగానికి నాయకుడు. హమాస్ యాంటీ-ట్యాంక్ క్షిపణి స్క్వాడ్‌పై దాడి చేయడానికి ఇజ్రాయెలీ గ్రౌండ్ ట్రూప్‌లు ఒక విమానాన్ని ప్రయోగించి ఇజ్రాయెల్‌పై రాకెట్లను ప్రయోగించిన పలువురు హమాస్ సైనికులను కూడా హతమార్చారుఅంతకు ముందు రోజు లెబనీస్ భూభాగం నుండి కాల్పులకు ప్రతిస్పందనగా ఆమ్లా గిడ్డంగితో సహా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఒక నెల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి లెబనాన్ సరిహద్దులో ఉన్న ఇజ్రాయెల్ దళాలపై హిజ్బుల్లా యోధులు దాడి చేశారు.

హమాస్ మౌళిక సదుపాయాలు, ఆయుధ డిపోలే లక్ష్యంగా..

గాజాలోని గ్రౌండ్ ట్రూప్‌లు మరియు సాయుధ వాహనాలకు ఒకే ఒక లక్ష్యం ఉందని అది హమాస్ మౌలిక సదుపాయాలు, వారి కమాండర్లు, బంకర్లు, కమ్యూనికేషన్లను ధ్వంసం చేయడమేనని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ అన్నారు. హమాస్ యొక్క గాజా చీఫ్ యాహ్యా సిన్వార్ తన బంకర్ నుండి ఒంటరిగా ఉన్నాడని మరియు అతని అనుచరగణం బలహీనపడుతోందని చెప్పారు. పాఠశాలలు, ఆసుపత్రుల దిగువన కిలోమీటర్ల కొద్దీ సొరంగాలు ఉన్నాయని, ఆయుధాల డిపోలు, కమ్యూనికేషన్ గదులు, ఉగ్రవాదుల కోసం రహస్య స్థావరాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు.హమాస్ యొక్క విస్తృతమైన సొరంగ నెట్‌వర్క్‌ను కూల్చివేయడానికి దేశంలోని ఇంజనీరింగ్ కార్ప్స్ పేలుడు పరికరాలను మోహరిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు.

ఇజ్రాయెల్ దళాలు వారం రోజులనుంచి గాజా లోపల పాలస్తీనా తీవ్రవాదులతో పోరాడుతున్నాయి. గాజా నగరాన్ని దిగ్బందించడంతో ఆహారం, మందులు, ఇంధనం మరియు నీటి సరఫరా తగ్గిపోయాయి. ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న పాఠశాలలు షెల్టర్లుగా మారిపోయాయి. గాజాలో జరిగిన దాడుల్లో కనీసం 31 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 10,000 దాటిందని హమాస్ ఆధ్వర్యంలోని గాజా స్ట్రిప్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది, వీరిలో 4,100 మంది మైనర్లు ఉన్నారు.