Site icon Prime9

Israel – Hamas War: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించిన మరో హమాస్ కమాండర్

Israel – Hamas War

Israel – Hamas War

Israel – Hamas War:ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపంలోని నిరిమ్ కిబ్బట్జ్ ప్రాంతంలో మరో సీనియర్ హమాస్ కమాండర్ బిల్లాల్ అల్-ఖేద్రాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ వైమానిక దళం ఆదివారం తెలిపింది. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు కిబ్బట్జ్ నిరిమ్ ఊచకోతకు కారణమైన దక్షిణ ఖాన్ యునిస్‌లోని దళాల నుఖ్బా కమాండర్ బిల్లాల్ అల్ కేద్రాను గత రాత్రి చంపాయి. హమాస్ మరియు ఇస్లామిక్ జిహాద్ టెర్రర్ కార్యకర్తలు కూడా చంపబడ్డారు అంటూ వైమానిక దళం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రకటించింది.

ముగ్గురు కమాండర్లు హతం..(Israel – Hamas War)

గాజాలోని జైతున్, ఖాన్ యూనిస్ మరియు పశ్చిమ జబాలియా ప్రాంతాలలో కనీసం 100 సైనిక లక్ష్యాలు వైమానిక దాడులకు గురయ్యాయని వైమానిక దళం తెలిపిందిఇది హమాస్ సామర్థ్యాలపై ప్రభావం చూపిందని, వారి ఆపరేషన్ కమాండ్ సెంటర్లు, మిలిటరీ కాంపౌండ్‌లు మరియు ట్యాంక్ నిరోధక క్షిపణులను లక్ష్యంగా చేసుకున్నామని పేర్కొంది. గత 48 గంటల్లో ఇజ్రాయెల్ బలగాలు హతమార్చిన వారిలో మూడవ హమాస్ కమాండర్ బిల్లాల్ అల్-ఖేద్రా. అంతకుముందు, ఇజ్రాయెల్ సైన్యం సీనియర్ హమాస్ నాయకులు అలీ ఖాదీ మరియు మురాద్ అబూ మురాద్‌లను హతమార్చింది, ఇద్దరూ గత వారం ఇజ్రాయెల్‌పై విధ్వంసక దాడిలో కీలక పాత్ర పోషించారు.

యుద్ధం ఎనిమిదవ రోజుకు చేరిన నేపధ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్ ) గాజా స్ట్రిప్‌లో ముఖ్యమైన గ్రౌండ్ ఆపరేషన్ కోసం సన్నాహాలను పూర్తి చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో గాలి, భూమి మరియు సముద్రం నుండి ఉమ్మడి మరియు సమన్వయ దాడి ఉంటుందని పేర్కొంది. గాజాలో హమాస్‌ను నిర్మూలించడానికి ఐడిఎఫ్ పనిచేస్తోంది. మా యుద్ధం గాజా ప్రజలతో కాదు.. మేము గాజా నివాసులను వారి స్వంత భద్రత కోసం దక్షిణ దిశగా ఖాళీ చేయాలని చెబుతున్నాము. ఇది అంతర్జాతీయ చట్టం కారణంగా మాత్రమే కాదు. మా విలువలు, నైతికత అంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ అన్నారు

Exit mobile version