Google Lay Offs: అమెరికాలో పనిచేస్తున్న ఐటి ఉద్యోగులు పరిస్థితి దారుణంగా తయారైంది. ఏదో చిన్నా చితకా కంపెనీ అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీ అయితే అందరి ఫోకస్ ఆ కంపెనీపై ఉంటుంది. తాజాగా అల్ఫాబెట్ మాతృసంస్థ గూగుల్ విచక్షణా రహితంగా ఉద్యోగులపై వేటు వేస్తూ పోతోంది. కంపెనీ వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఎడాపెడా కోత విధిస్తోంది. తాజాగా కంపెనీకి చెందిన పైతాన్ టీంను ఇంటికి పంపించింది. వారి స్థానంలో అతి తక్కువ వేతనానికి దొరికే ఉద్యోగులను ఇతర దేశాల నుంచి తెప్పించుకోవాలని చూస్తోంది. తాజాగా మాజీ గూగుల్ ఉద్యోగి తన అనుభవాన్ని లింక్‌డిన్‌లో వివరించారు. ఇటీవల తనతో పాటు తన మేనేజర్.. టీంసభ్యులను ఉద్యోగంలోకి తీసేశారని ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలను ఆయన వివరించారు.
ఇక్కడ చైనాకు చెందిన మాట్ హును తీసుకుందాం. ఆయన గత రెండు సంవత్సరాల నుంచి గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన చైనా నుంచి హెచ్-1 బీ వీసాపై ఇక్కడికి వచ్చాడు. తాను ఇంట్లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి టీవీ చేస్తున్నప్పుడు రాత్రి ఎనిమిది గంటల సమయంలో తన ల్యాప్ టాప్‌కు ఓ ఈ మెయిల్ వచ్చింది. మెయిల్ ఒపెన్ చేసిన వెంటనే క్లౌడ్‌టాప్ ఆపరేషన్‌ను నిలిపివేయాలనేది అసలు సందేశం.. కొన్ని రోజుల క్రితమే ఈ ఆపరేషన్ ప్రారంభించాం. ఐదు నిమిషాల పాటు ఏం జరుగుతుందో కూడా తనకు అర్ధం కాలేదు. మొత్తానికి ఇక గూగుల్‌తో తనకు ఉన్న బంధం ముగిసిందని తెలిసిందన్నాడు మాట్ హు.
ఇక గూగుల్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. గత 13 సంవత్సరాల నుంచి కంపెనీకి సేవలు అందించిన వారిపై కూడా వేటుపడింది. గూగుల్‌లో మొట్టమొదటిసారి కోడింగ్‌ను రాసిన టీం.. జీరో నుంచి కంపెనీని పైకి తీసుకువచ్చిన టీంను కూడా ఇంటికి పంపించారు. తన సొంత పాపను వదిలివెళ్తున్నట్లు అనిపించిందని టీం లీడర్ తన సహచరులకు పంపిన ఈ మెయిల్‌లో పేర్కొన్నారు.ఇక చైనాకు చెందిన మాట్ హు విషయానికి వస్తే.. తమ టీంలో 50 శాతం మందిపై వేటు వేశారు. సీనియర్ మేనేజర్ల నుంచి టీం లీడర్ల వరకు అందరిపై వేటు పడుతోంది. మొత్తానికి గూగుల్ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు తమ వంతు వస్తుందా అని హడలి పోతున్నారు.