Site icon Prime9

Geetika Srivastava: ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ లో మొట్టమొదటి మహిళా దౌత్యవేత్తగా గీతికా శ్రీవాస్తవ

Geetika Srivastava

Geetika Srivastava

Geetika Srivastava: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీ (ఇండో-పసిఫిక్) గీతికా శ్రీవాస్తవ, ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో చార్జ్ డి’అఫైర్స్‌గా బాధ్యతలు చేపట్ట బోతున్నారు. దీనితో ఈ పదవిలోకి వచ్చిన  మొదటి మహిళా దౌత్యవేత్తగా ఆమె నిలుస్తారు.

 ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత..(Geetika Srivastava)

భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత దౌత్య సంబంధాలను తగ్గించుకోవాలని పాకిస్తాన్ నిర్ణయించింది. దీనితో ఆగస్టు 2019 నుండి ఇస్లామాబాద్ మరియు న్యూఢిల్లీలోని భారత మరియు పాకిస్తాన్ కమిషన్లకు హైకమిషనర్లు నాయకత్వం వహించడం లేదు. అంతేకాదు భారత్ పై ఉగ్రదాడులకు పాకిస్తాన్ పరోక్షంగా సహకరిస్తోందన్న వార్తల నేపధ్యంలో ఇరు దేవాల మద్య దౌత్య సంబంధాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి.మరోవైపు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రస్తుతం విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మరియు టర్కీ డెస్క్‌ల డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సాద్ వార్రైచ్‌ను న్యూఢిల్లీలో కొత్త ఛార్జ్ డి అఫైర్స్‌గా ఎంపిక చేసింది.గతంలో పాకిస్థానీ ఛార్జ్ డి’అఫైర్స్‌గా ఉన్న సల్మాన్ షరీఫ్ ను ఇటీవల ఇస్లామాబాద్‌కు తిరిగి పిలిచారు. ఇస్లామాబాద్‌లోని ప్రస్తుత భారతీయ చార్జి డీ అఫైర్స్ సురేష్ కుమార్ త్వరలో న్యూఢిల్లీకి తిరిగి వస్తారని  తెలుస్తోంది.

ఇండియన్ ఫారిన్ సర్వీస్ 2005 బ్యాచ్‌కు చెందిన శ్రీవాస్తవ 2007-09 మధ్యకాలంలో చైనాలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేశారు. ఆమె కోల్‌కతాలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో హిందూ మహాసముద్ర ప్రాంత విభాగానికి డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

 

Exit mobile version