Site icon Prime9

Baba Vanga: అణు విస్ఫోటనం నుండి బయోవార్ వరకూ.. 2023 పై బాబా వంగా షాకింగ్ జోస్యాలు..

Baba Vanga

Baba Vanga

Baba Vanga predictions: బాబా వంగా బల్లేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాల్లో నిజమైంది. బాబా వంగా బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి చెప్పించుకునేవారు.

ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రడామస్ తర్వాత ప్రపంచ భవిష్యత్‌ను కచ్చితంగా అంచనా వేసింది. ఈ బల్గేరియా బాబా వంగానే అని చెబుతుంటారు. 1996లో తన 85వ ఏట ఈమె చనిపోయారు. తన చిన్నప్పుడు వచ్చిన ఓ భయంకర పెనుతుఫానులో చిక్కుకొని కళ్లు పొగొట్టుకున్న బాబా వంగా దూరదృష్టితో భవిష్యత్ పరిణామాలను వీక్షించారని, ఆమె చెప్పినవి చెప్పినట్టే జరగడం సంచలనమైంది. బాబా వంగా చనిపోవడానికి ముందు చెప్పినట్టే, ఉక్రెయిన్‌ పై రష్యా దండయాత్ర చేసింది. రెండు దేశాల మధ్య యుద్ధానికి దారి తీసినప్పటి నుండి ఎనిమిది నెలలకు పైగా గడిచిపోయింది. ఇది చివరికి ఉక్రెయిన్లో విస్తృతమైన విధ్వంసం, మరణాలకు దారితీసింది. చాలా నెలల తర్వాత శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరుదేశాల నేతలు సుముఖత వ్యక్తం చేయకపోవడం వల్ల చాలా మంది నిపుణులు “3వ ప్రపంచ యుద్ధం” రావచ్చని అంచనా వేస్తున్నారు. 2023లో 3వ ప్రపంచ యుద్ధం గురించి ప్రఖ్యాత బాబా వంగా చేసిన అంచనాలను చూస్తే ఈ పరిస్థితులు వచ్చేలా కనిపిస్తున్నాయి.

2023 లో బాబా వంగా అంచనాలివీ, వాటి ప్రకారం ఒక పెద్ద దేశం జీవ ఆయుధాలతో ప్రజల పై దాడి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొత్తం ప్రపంచానికి నిజమైన ముప్పుగా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలను ఉపయోగిస్తామని అనేక సార్లు బెదిరించారు. బాబా వంగా ప్రకారం, 2023 సంవత్సరంలో సౌర తుఫాను లేదా సౌర సునామీ సంభవిస్తుంది. ఇది భూమి పై ఆవరించిన అయస్కాంత కవచాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. ప్రపంచం మొత్తం చీకటిలో కప్పబడి ఉంటుంది. గ్రహాంతర వాసులు భూమి పై దాడి చేయవచ్చు. లక్షలాది మంది ప్రజలు చనిపోతారు. అణు విద్యుత్ ప్లాంట్లో పేలుడు సంభవించవచ్చు. దీని కారణంగా విషపూరిత మేఘాలు ఆసియా ఖండాన్ని కప్పివేస్తాయి. ఫలితంగా అనేక దేశాలు తీవ్రమైన వ్యాధుల బారిన పడతాయి.

2023 నాటికి మనుషులు ప్రయోగశాలల్లో పుడతారు. ఇక్కడ నుండి వ్యక్తుల పాత్ర, చర్మం యొక్క రంగు నిర్ణయించబడుతుంది. అంటే జనన ప్రక్రియ పూర్తిగా నియంత్రించబడుతుంది. 2022లో బాబా వంగా చేసిన రెండు అంచనాలు నిజమయ్యాయి. 2022లో కొన్ని దేశాల్లో నీటికి సంబంధించిన సమస్యలు, కొన్ని దేశాల్లో వరదల కారణంగా పరిస్థితి మరింత దిగజారుతుందని బాబా వంగా అంచనా వేశారు. పోర్చుగల్, ఇటలీలో చాలా ప్రాంతాల్లో కరువు ఉంది. అదే సమయంలో ఆస్ట్రేలియా, ఆసియా దేశాలు 2022లో తీవ్ర వరదలను ఎదుర్కొన్నాయి. 1996లో బాబా వంగా మరణానికి ముందు ఆమె అనేక అంచనాలు వేసింది. అవి ఇప్పుడు నిజమని రుజువు చేస్తున్నాయి. ఆమె పారానార్మల్ సామర్ధ్యాలను కలిగి ఉందని ప్రపంచవ్యాప్తంగా అందరూ నమ్ముతారు. చూడాలి మరి 2023లో బాబా వంగా జోస్యాలు ఎంతవరకు నిజం అవుతాయో.

Exit mobile version