Francoise Bettencourt Meyers: ప్రముఖ ఫ్రెంచ్ వ్యాపారవేత్త ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ ఇటీవల 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా ఆమె రికార్డు సొంత చేసుకున్నారని బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. తాత స్థాపించిన బ్యూటీ ప్రొడక్ట్స్ సామ్రాజ్యంలో అరుదైన ఘనత సాధించారు.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆమె తాత స్థాపించిన ”ఎల్’ఓరియల్” షేర్స్ భారీగా పెరగడంతో ఆమె సంపద 2023 డిసెంబర్ 28 నాటికి 100.2 బిలియన్లకు చేరింది. ప్రస్తుతం ఈమె ప్రపంచంలోనే 12వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.కంపెనీ బోర్డు వైస్-ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బెటెన్‌కోర్ట్ మేయర్స్ ”ఎల్’ఓరియల్” లో దాదాపు 35 శాతం వాటాను కలిగి ఉన్నారు. లాక్‌డౌన్ సమయంలో కంపెనీ విక్రయాలు కొంత మందగించినప్పటికీ.. మహమ్మారి తగ్గుముఖం పట్టాక అమ్మకాల వేగం బాగా పెరిగింది.
2017లో బెటెన్‌కోర్ట్ మేయర్స్ తల్లి ‘లిలియన్ బెటెన్‌కోర్ట్’ మరణించిన తరువాత కుటుంబ వారసురాలిగా సంస్థలో అడుగుపెట్టారు. ఆ తరువాత తనదైన రీతిలో కంపెనీ పురోగతికి పాటుపడుతూ.. ఫ్రాన్స్‌లో అత్యంత ధనిక మహిళల జాబితాలో ఒకరుగా నిలిచారు. ఆమె వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే బెటెన్‌కోర్ట్ మేయర్స్ ప్రముఖ వ్యాపారవేత్త అయినప్పటికి పెద్దగా ఆడంబరమైన జీవితాన్ని కోరుకోదని తెలుస్తోంది. ఈమె ఫైవ్ వ్యాల్యూ స్టడీ ఆఫ్ ది బైబిల్ గ్రీకు దేవతల వంశావళి అనే రెండు పుస్తకాలూ రాశారు.