Site icon Prime9

Imran Khan Remand: అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 8 రోజుల రిమాండ్

Imran Khan Remand

Imran Khan Remand

Imran Khan Remand: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అవినీతి నిరోధక శాఖ ఎనిమిది రోజుల పాటు కస్టడీకి పంపింది. నేషనల్ అకౌంటబిలిటీ (NAB) అవినీతి కేసుల్లో ప్రశ్నించేందుకు ఇమ్రాన్ ఖాన్ ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఇస్లామాబాద్‌లోని కోర్టును కోరింది.దీనితో కోర్టు ఎనిమిదిరోజుల పాటు కస్టడీకి అనుమతించింది.

టార్చర్ .. వాష్ రూమ్ కు వెళ్లనివ్వలేదు..(Imran Khan Remand)

తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని, వాష్‌రూమ్‌ను కూడా ఉపయోగించుకోనివ్వలేదని ఇమ్రాన్ ఖాన్ కోర్టులో ఆరోపించారు.నెమ్మదిగా గుండెపోటును ప్రేరేపించడానికి తనకు ఇంజెక్షన్ ఇచ్చారని ఆరోపించారు.ఇస్లామాబాద్ కోర్టు ఈ నెల 17న తదుపరి విచారణ చేపట్టనుంది. మంగళవారం ఇస్లామాబాద్‌లో సాధారణ విచారణ సందర్భంగా కోర్టుకు హాజరయిన ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేశారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) వైస్ చైర్‌పర్సన్ మరియు మాజీ ఆర్దికమంత్రి షా మెహమూద్ ఖురేషీ ను అరెస్టు చేశారు.

తోషాఖానా కేసులో దోషిగా..

మరోవైపు అదనపు సెషన్స్ కోర్టు ఇమ్రాన్ ఖాన్ పై తోషాఖానా కేసులో అభియోగాలు మోపింది.ఇమ్రాన్ ఖాన్ తాను ప్రధానిగా ఉన్నపుడు అందుకున్న బహుమతులను తోషాఖానా అనే స్టేట్ డిపాజిటరీలో ఉంచకుండా అమ్ముకున్నాడనేది ప్రధాన అభియోగం.తోషాఖానా అనేది క్యాబినెట్ డివిజన్ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉన్న ఒక విభాగం. ఇతర ప్రభుత్వాలు మరియు రాష్ట్రాల అధిపతులు మరియు విదేశీ ప్రముఖులు పాలకులు, పార్లమెంటేరియన్లు, బ్యూరోక్రాట్‌లు మరియు అధికారులకు ఇచ్చే విలువైన బహుమతులను నిల్వ చేస్తుంది.

వారు బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యక్తులు..

భారతదేశం నుండి ఆర్‌ఎస్‌ఎస్ మరియు బిజెపి పంపిన వ్యక్తులు పాకిస్తాన్‌లో విధ్వంసకాండలు మరియు దహనాలకు పాల్పడుతున్నారని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రత్యేక సహాయకుడు అట్టా తరార్ పేర్కొన్నారు.”విధ్వంసం మరియు దహనం చేస్తున్నవారు భారతదేశం నుండి ఆర్‌ఎస్‌ఎస్ మరియు బిజెపి పంపిన వ్యక్తులు”అని తరర్ బుధవారం మీడియా సమావేశంలో
పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపధ్యంలో అతని మద్దతుదారులచే పాకిస్తాన్ అంతటా భారీ నిరసనలు చెలరేగాయి. ఈ నిరసనలు ఆస్తుల ధ్వంసానికి దారితీశాయి.నిరసన కారులు రోడ్లపైకి వచ్చి టైర్లు కాల్చి రోడ్లను బ్లాక్‌ చేశారు. జాతీయ రహదారులను దిగ్భందం చేశారు. రావల్పిండిలోని జనరల్‌ హెడ్‌క్వార్టర్స్‌కు దారితీసే రోడ్లను మూసివేశారు. ఇస్లామాబాద్‌, లాహోర్‌, కరాచీ, పెషావర్‌తో పాటు దేశంలోని అన్ని పెద్ద నగరాల్లో పిటిఐ మద్దతుదారులు జాతీయ రహదారులను మూసివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిలిటరీ ఎస్టాబ్లిస్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్‌ ఆకౌంటబిలిటి బ్యూరో (న్యాబ్‌) పాకిస్తాన్‌ రేంజర్స్‌ అధికారులపై పిటిఐ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖాన్‌ మద్దతుదారులు తమ ఆగ్రహాన్ని మిలిటిరి కార్యాలయాలపై చూపుతున్నారు. మిలిటరి కార్యాలయాలను ధ్వంసం చేయడంతో పాటు వారి ఇళ్లను టార్గెట్‌ చేస్తున్నారు.

 

Exit mobile version