Site icon Prime9

Florida: అమెరికాలో భారత సాఫ్ట్ వేర్ దుర్మరణం

Florida

Florida

Florida: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్లోరిడా రాష్ట్రంలోని తాంపాలో ఫుట్ పాత్ క్రాస్‌ వద్ద రోడ్డు దాటుతున్న మరియప్పన్‌ సుబ్రమణియన్‌ (32) ను ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాదానికి కారణమైన కారు రెడ్ సిగ్నల్ ను జంప్ చేసి వచ్చి ఢీకొట్టినట్టు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు.

 

మ‌ృతదేహాం తరలింపుకు ప్రయత్నాలు(Florida)

మరియప్పన్‌ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీలో టెస్ట్‌ లీడ్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, నాలుగేళ్ల కొడుకు ఉన్నారు. అయితే మరియప్పన్ కుటుండం భారత్‌లో ఉంటున్నారు. కాగా ఆయన ఈ మధ్యనే జాక్సన్‌విల్లే నుంచి తాంపాకు వెళ్లినట్టు తెలుస్తోంది.

కాగా, ప్రమాదంలో మృతి చెందిన మరియప్పన్‌ కుటుంబానికి సహాయం అందించేందుకు ‘గో ఫండ్‌ మీ’ అనే పేజీ ద్వారా ఫండ్‌ రైజింగ్‌ చేపట్టారు. అలాగే తాంపా, జాక్సన్‌విల్లే ప్రాంతాల్లోని కమ్యూనిటీ గ్రూప్‌ సభ్యులు మరియప్పన్‌ మృత దేహాన్ని భారత్‌ తరలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

 

Exit mobile version