Finland: ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఏంటో తెలుసా..?

ప్రతి ఏటా మార్చి 20 ప్రపంచ సంతోష దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. ఐక్య రాజ్యసమితి వార్షిక హ్యాపీనెస్ సూచీల ప్రకారం..

Finland: ప్రపంచంలోనే అత్యంత సంతో షకరమైన దేశంగా ఫిన్లాండ్ మరోసారి ఘనత సాధించింది. ఫిన్లాండ్ అత్యంత సంతోషంగా ఉండే దేశంగా 6వ సారి అగ్రస్థానంలో నిలించింది. ఐక్యరాజ్యసమితి సస్ట్రైనబుల్ డెవలప్ మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్.. ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ను ప్రచురిస్తుంది.

రెండో స్ఠానంలో డెన్మార్క్(Finland)

ఈ రిపోర్టును 150కి పైగా దేశాల్లో ప్రజల నుంచి వచ్చిన ప్రపంచ సర్వే ఆధారంగా రూపొందిస్తారు. ప్రతి ఏటా మార్చి 20 ప్రపంచ సంతోష దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. ఐక్య రాజ్యసమితి వార్షిక హ్యాపీనెస్ సూచీల ప్రకారం.. డెన్మార్క్ అత్యంత సంతోషకరమైన దేశంగా రెండో స్థానంలో నిలిచింది. ఐస్ లాండ్ మూడో స్థానంలో ఉంది.ఇక అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్ నివేదికలో నేపాల్, చైనా, శ్రీలంకల కంటే కింద ఉండటం గమనార్హం.

భారత్ ఏ స్థానంలో ఉందంటే..(Finland)

నివేదికలో భారత్ 126 వ స్థానంలో నిలిచింది. మరో వైపు రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా హ్యాపీనెస్ నివేదికలో వాటి ర్యాంకులు దారుణంగా పడిపోయాయి. రష్యా 72వ స్థానంలో ఉండగా.. ఉక్రెయిన్ 92వ స్థానంలో ఉంది. కాగా, ఒక దేశ సంతోషాన్ని దాని తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవన విధానం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి తదితర అంశాల ఆధారంగా కొలిచి హ్యాపీనెస్ సూచీలో స్థానం కల్పిస్తారు. అయితే అనూహ్యాంగా 2021లో ఇతరుల పట్ల దయ చూపడం, ముఖ్యంగా అపరిచితులకు సహాయం చేయడం లాంటివి పెరిగాయి. ఇది 2022లో మరింత ఎక్కువగా పెరిగినట్లు ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్ పేర్కొంది.