Site icon Prime9

FBI: నాలుగేళ్లకిందట మిస్సింగ్ అయిన భారతీయ విద్యార్థిని .. ఆచూకీ చెబితే 8 లక్షల రివార్డు ఇస్తామన్న ఎఫ్ బి ఐ

FBI

FBI

FBI: ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( ఎఫ్ బి ఐ) నాలుగు సంవత్సరాల క్రితం న్యూజెర్సీ రాష్ట్రం నుండి తప్పిపోయిన భారతదేశానికి చెందిన 29 ఏళ్ల మహిళా విద్యార్థి గురించి సమాచారం ఇస్తే $10,000 వరకు రివార్డ్‌ను ఇస్తామంటూ ఆఫర్ చేసింది.

తప్పిపోయిన వ్యక్తుల జాబితాలో..(FBI)

మయూషి భగత్‌ అనే ఈ విద్యార్థిని చివరిసారిగా ఏప్రిల్ 29, 2019 న పైజామా ప్యాంటు మరియు నల్లటి టీ-షర్ట్ ధరించి తన అపార్ట్‌మెంట్ నుండి బయలుదేరింది.మే 1, 2019న ఆమె తప్పిపోయినట్లు భగత్ కుటుంబం నివేదించింది. ఎఫ్ బి ఐ నెవార్క్ ఫీల్డ్ ఆఫీస్ మరియు జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ గత ఏడాది జూలైలో తప్పిపోయిన వ్యక్తుల జాబితాలో ఆమె పేరును జోడించి, భగత్ అదృశ్యాన్ని పరిష్కరించడానికి ప్రజల సహాయాన్ని కోరుతున్నాయి. ఎఫ్ బి ఐ ఆమె లొకేషన్ లేదా రికవరీకి దారితీసే సమాచారం కోసం $10,000 రివార్డ్‌ను అందిస్తోంది. భగత్ ఆచూకీ గురించి లేదా ఆమె అదృశ్యం గురించి ఎవరైనా సమాచారం ఉంటే, నెవార్క్ లేదా జెర్సీ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు కాల్ చేయాలని ఒక ప్రకటనలో పేర్కొంది.

భగత్ జూలై 1994లో భారతదేశంలో జన్మించారు.న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యను పూర్తి చేయడానికి స్టూడెంట్ వీసాపై యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నారు. ఆమె ఇంగ్లీష్, హిందీ మరియు ఉర్దూ మాట్లాడుతుంది. ఆమెకు న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్‌లో స్నేహితులు ఉన్నారని డిటెక్టివ్‌లు చెప్పారు. ఆమె 2016లో ఎఫ్1 స్టూడెంట్ వీసాపై అమెరికాకు వచ్చింది.

Exit mobile version