Site icon Prime9

రేహం ఖాన్‌: తన కంటే 13 ఏళ్ల చిన్నవాడిని పెళ్లిచేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహం ఖాన్‌

Reham khan

Reham khan

Reham khan: పాకిస్తాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య రేహం ఖాన్‌ వివాహం చేసుకున్నారు. 49 ఏళ్ల రేహంఖాన్‌ తన కంటే 13 ఏళ్ల చిన్న వాడైన మోడల్‌, నటుడు మీర్జా బిలాల్‌ బేగ్‌తో అమెరికాలో పెళ్లి చేసుకున్నట్లు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అమెరికాలోని సియాటెల్‌లో తన తల్లిదండ్రులు, తన కొడుకు, తన వకీల్‌ సమక్షంలో నిఖా జరిగిందని వివరించారు. ఎట్టకేలకు తాను కోరుకున్నట్లు.. నమ్మకస్తుడు అయిన వ్యక్తి తనకు దొరికాడని సంతోషం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియాలో నిఖా ఫోటోలను షేర్‌ చేశాయి. కాగా రేహం తెల్లాటి వైట్‌ గౌన్‌ ధరించగా.. 36 ఏళ్ల ఆమె భర్త బిలాల్‌ సూట్‌ ధరించాడు. కాగా ఇద్దరు చేతులు కలిపి ఓ ఫోటోను కూడా పోస్ట్‌ చేశారు. దానిపై జస్ట్‌మ్యారిడ్‌ అని రాసి ఉంది. కాగా బిలాల్‌కు, రేహంకు కూడా ఇది మూడవ పెళ్లి. ఇక బిలాల్‌ విషయానకి వస్తే అమెరికా కార్పరేట్‌ ప్రొఫెషనల్‌తో పాటు మాజీ మోడల్‌.

రేహం ఖాన్‌ పాకిస్తాన్‌ బ్రిటిష్‌ టెలివిజన్‌ జర్నలిస్టు . 2014 లో రేహంఖాన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని ఖాన్‌ ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. కేవలం పది నెలల్లోనే వీరు విడిపోయారు. ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత విడాకులకు దారి తీసిన కారణాలు ఆమె వివరించారు. పాకిస్తాన్‌లో తనపై విద్వేషపూరిత ప్రచారం చేశారని అందుకే తమ పెళ్లి దీర్ఘకాలం పాటు కొనసాగలేకపోయిందన్నారు రేహం.లిబియాలో పుట్టిన రేహంఖాన్‌ విద్యాభ్యాసం అంతా పాకిస్తాన్‌లో కొనసాగింది. 90 దశకంలో బ్రిటన్‌లో ఆమె బ్రాడ్‌కాస్టింగ్‌ జర్నలిస్టుగా తన కేరీర్‌ను ప్రారంభించారు. బీబీసీ సౌత్‌ టుడేకు ఆమె వెదర్‌ ప్రెసెంటర్‌గా పనిచేశారు. తర్వాత 2012లో ఆమె పాకిస్తాన్‌కు వచ్చిన వెంటనే ఆమె ఇమ్రాన్‌ ఖాన్‌తో భేటీ అయ్యారు. ఒక టీవీ షోకు ఆమె ఖాన్‌తో ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు కేవలం పది నెలల కాలంలో విడాకులు తీసుకున్నారు.

రేహంఖాన్‌ మొదటి పెళ్లి ఇజాజ్‌ రెహమాన్‌ సైకియాట్రిస్టుతో 1993లో జరిగింది. అటు తర్వాత 2005లో విడాకులు తీసుకున్నారు. ఆమె రెండవ పెళ్లి ఇమ్రాన్‌ఖాన్‌తో జరిగింది. కేవలం పది నెలలు తిరిగే సరికి విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు 2014లో పెళ్లి చేసుకుని 2015లో విడాకులు తీసుకున్నారు. కాగా రేహంకు విడాకులు ఇచ్చిన తర్వాత ఖాన్‌ బుష్రాబీబీని పెళ్లి చేసుకున్నారు. అటు తర్వాత ఖాన్‌పై ఆమె నిప్పులు చెరిగారు. ఖాన్‌ చేతిలోమోసపోయానని విమర్శలు గుప్పించారు.

Exit mobile version