Imran Khan: పాకిస్తాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ చైర్మన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించాలని చూస్తోంది .షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. ఫారిన్ ఫండింగ్ కేసులో ఖాన్‌ను జైలుకు పంపాలనుకుంటున్నట్లు పాకిస్తాన్‌కు చెందిన ఎఆర్‌వై న్యూస్ వెల్లడించింది. కాగా ఖాన్‌కు చెందిన పిటిఐ పార్టీకి చెందిన ముగ్గురు ప్రముఖ నాయకులు తారిఖ్ షఫీ, హమీద్ జమాన్, సైఫ్ నియాజీలను ఒకే రోజు అరెస్టు చేశారు. ఇక నెక్స్ట్ ఇమ్రాన్ ఖాన్ వంతు అని చెబుతున్నారు. కాగా పాకిస్తాన్ హోంమంత్రి రానా సనావుల్లా వెంటనే ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
పాకిస్తాన్‌కు చెందిన మరో అతి పెద్ద పత్రిక డాన్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. పోలీసు అధికారులను ఫెడరల్ గవర్నన్‌మెంట్ ఇమ్రాన్‌ఖాన్‌ను హౌస్ అరెస్టు చేయాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఇంతకు ఖాన్ అరెస్టు చేయడానికి గల కారణాల విషయానికి వస్తే..ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖాన్ లాంగ్ మార్చ్ ప్రకటించారు. అవకాశం దొరికినప్పుడల్లా భారీ బహిరంగసభలు పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతుండటంతో ప్రభుత్వం పరువు పోతోందని భావించి ఖాన్ ఆయన సొంతిల్లు బనీగలాకే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఖాన్ పార్టీకి చెందిన సైఫుల్లా నియాజీని నిన్న ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అరెస్టు చేసింది. ఆయనపై మోపిన చార్జీల విషయానికి వస్తే .. నియాజీ అనధికార వెబ్ సైట్ నిర్వహిస్తున్నారని, వెబ్‌సైట్ నిర్వహణకు చట్టవ్యతిరేకంగా నిధులు సేకరిస్తున్నారని ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆరోపిస్తోంది. నిన్న ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఓ మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత వెంటనే పీటిఐకి చెందిన సీనియర్ నాయకులు తారిఖ్ షఫీ, హమీద్ జమాన్, సైఫీ నియాజీలను అరెస్టు చేసింది. కాగా ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చిన ఆజాదీ మార్చ్‌తో ప్రభుత్వంలో వణుకుమొదలైందని మరో పిటిఐ నాయకుడు ఫవాద్ హుస్సేన్ ట్విట్ చేస్తూ ఎద్దేవా చేశారు.
నిన్న పాక్ హోంమంత్రి రానా సనావుల్లా ఓ మీడియా సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చేసేందుకు గల కారణాలను వివరించారు. ఫారిన్ ఫండింగ్ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఏ ముందు హాజరు కావాల్సిన వీరంతా హాజరు కాకుండా తప్పించుకున్నారని వివరించారు. ఇదిలా ఉండగా ఇస్లామాబాద్‌లో పిటిఐ తలపెట్టిన హకీకి ఆజాదీమార్చ్‌కు ఇమ్రాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖాన్ ఇలా ఆజాద్ మార్చ్‌కు పిలుపు నిచ్చారో లేదా.. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం వెంటనే రాజధాని ఇస్లామాబాద్‌లో సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఆజాద్ మార్చ్‌కు అడ్డుకట్ట వేయాలని గట్టి నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజలందరిని రోడ్లపైకి రావాల్సింది కోరారు. దేశంలో వెంటనే ఎన్నికలు జరిపించాలని గళమెత్తాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.