Europe: యూరప్‌లో మరోమారు కరోనా -19 పంజా విసిరే అవకాశాలు కనిపిస్తున్నాయని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెంన్షన్ కంట్రోల్ తమ పౌరులను హెచ్చరించింది. రాబోయే వారాల్లో కరోనా విజృంభించే అవకాశాలున్నాయని ఈసీడీసీ పేర్కొంది. కరోనా మహమ్మారి పూర్తిగా కనుమరుగు కాలేదని వెల్లడించింది. కొత్త రకం వైరస్ రాబోయే వారాల్లో వచ్చే అవకాశం ఉందని, కొత్త రకం ఒమిక్రాన్ నుంచి సబ్ వెరియంట్‌లు వచ్చే అవకాశాలున్నాయని, వెంటనే ప్రజలు వాక్సినేషన్ చేసుకోవాలని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ నిన్న ఒక అలెర్ట్ జారీ చేసింది. అయితే హెల్త్‌రిస్క్ ఎక్కువగా ఉన్న వారు తక్షణమే వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించింది.
కొత్త రకం వైరస్ ముందుగా అంచనా వేసిన దాని కంటే కూడా శరవేగంగా విస్తరించే అవకాశాలున్నాయని ఈఎంఏ పేర్కొంది. దీనికి మన ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ మాత్రం వ్యాక్సినేషన్ చేసుకోవడంమేనని పేర్కొంది. రాబోయే చలికాంలో కోవిడ్‌తో పాటు ఫ్లూ రెండు వేగంగా విస్తరించే అవకాశాలున్నాయని ఈఎంఏ తెలిపింది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్‌తో పాటు ఇన్‌ఫ్లూయెంజ్‌పై అప్రమత్తంగా ఉండాలని, యూరోప్‌లో శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు వెంటనే వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించింది.
ఇది రిలాక్స్ అయ్యే సమయం కాదని డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్ హాన్స్‌క్లూగ్ ఈ వారం ప్రారంభంలో అన్నారు. యూరోపియన్ యూనియన్‌లో మొత్తం 53 దేశాలున్నాయని డబ్ల్యుహెచ్‌వో పేర్కొంది. వాటిలో రష్యాతోపాటు సెంట్రల్ ఏషియా దేశాలు కూడా ఉన్నాయి. కోవిడ్ -19కు ప్రధానకేంద్రం చైనా. కాగా ప్రపంచవ్యాప్తంగా వచ్చే కొత్త కొవిడ్ కేసులు ఈ ప్రాంతంలో నమోదయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈసారి వచ్చే కొత్త వేవ్‌తో మరణాలు ఉండకపోవచ్చునని, అలాగే ఆస్పత్రుల్లో లేదా ఐసీయులో చేరాల్సిన అవసరం ఉండకపోవచ్చునని డబ్ల్యుహెచ్‌ఓ పేర్కొంది.