Site icon Prime9

Erdogan: టర్కీ ప్రెసిడెంట్‌గా మరోసారి ఎర్దోగాన్‌

Erdogan

Erdogan

Erdogan:  టర్కీలో తనకు తిరుగులేదని తయ్యిప్‌ ఎర్డోగాన్‌ మరోసారి నిరూపించుకున్నారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఆయన ఎన్నికయ్యారు. రెండు దశాబ్దాలుగా టర్కీ పాలకుడిగా కొనసాగుతున్న ఎర్డోగాన్‌.. తాజాగా జరిగిన ఎన్నికల్లో 52 శాతం ఓట్లు సాధించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ అనడోలు న్యూస్‌ ఏజెన్సీ ప్రకటించింది. ప్రత్యర్థి కెమల్ కిలిక్‌డరోగ్లు 48 శాతం ఓట్లు వచ్చాయని పేర్కొంది. దీంతో ఆయన విజయం ఖాయమయింది.

భూకంపం సమయంలో ఎర్డోగాన్ పై ఆగ్రహం..( Erdogan)

ఆసియా, ఐరోపా ఖండాల్లో విస్తరించి ఉన్న టర్కీకి ఎర్డోగాన్‌ ప్రధానిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వస్తే మూడో దశాబ్దంలోకి ప్రవేశించినట్లువుతుంది. అయితే ప్రస్తుతం టర్కీ అత్యధిక ద్రవ్యోల్బణం, ఇటీవల భారీ భూకంపం తర్వాత ఆయన విజయావకాశాలు సన్నగిల్లాయి. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించడం విశేషం. ఫిబ్రవరి నెలలో వచ్చిన భూకంపం సమయంలో ఎర్డోగాన్‌ ప్రభుత్వం సరిగా స్పందించలేదని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.టర్కీ ప్రజలు మరో ఐదేళ్ల పాటు తనకు అధ్యక్ష పదవి అప్పగించినందుకు ఎర్డోగాన్ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఫలితాలు వెలువడిన తర్వాత ఇస్తాంబుల్‌లోని ఇంటి వెలుపల తన మద్దతుదారులతో ఆయన మాట్లాడారు. నేడు టర్కీ విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. తాను గత 21 ఏళ్లుగా మీ నమ్మకానికి పొందుతూవచ్చానని అన్నారు. కాగా బైబై కెమల్‌.. ఎర్డోగాన్‌ నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.

కిలిక్‌డరోగ్లు ఎర్డోగాన్ యొక్క ప్రజాస్వామ్య తిరోగమనాన్ని తిప్పికొట్టడానికి, మరింత సాంప్రదాయిక విధానాలకు తిరిగి రావడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి మరియు పశ్చిమ దేశాలతో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేస్తానని ప్రచారం చేశారు. ఎర్డోగాన్ కోసం అన్ని రాష్ట్ర వనరులను సమీకరించడంతో ఎన్నికలు అన్యాయమని ఆయన అన్నారు.మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం వచ్చే వరకు మేము ఈ పోరాటంలో అగ్రగామిగా ఉంటాము అని ఆయన అంకారాలో అన్నారు. తనకు ఓటు వేసిన 25 మిలియన్ల మందికి పైగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నిరంకుశ ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు తమ సంకల్పాన్ని ప్రదర్శించారని ఆయన అన్నారు.

Exit mobile version