Site icon Prime9

Elon Musk: మరోసారి తండ్రి అయిన ఎలాన్ మస్క్.. ఆసక్తికరంగా 14వ బిడ్డ పేరు?

Elon Musk Welcomes 14th Child: అపరకుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యాడు. తన 4వ ప్రేయసి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్‌గా శివోన్ జిలిస్ నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ 14వ సంతానానికి సెల్డాన్ లైకుర్గస్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని షివోన్ జిలిస్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఆయనకు 13 మంది పిల్లులుండగా.. తాజాగా 14వ బిడ్డకు తండ్రి అయ్యారు. కాగా, మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్‌తో ముగ్గురు, రచయిత ఆస్లే సెయింట్‌తో ఒక్కరు, షివోస్ జిలిస్‌తో నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ సందర్భంగా షివోన్ జిలిస్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘ఎలాన్‌తో చర్చించాను. మా బాబు సెల్డాన్ లైకుర్గస్ విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలాని స్వయంగా నిర్ణయించుకున్నాం.’ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఇవాళ మా మూడో బిడ్డ ఆర్కాడియా జన్మదినం పురస్కరించుకొని ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆమె చేసిన ఈ పోస్టుకు ఎలాన్ మస్క్ హార్ట్ సింబల్‌తో స్పందించారు.

Exit mobile version
Skip to toolbar