Site icon Prime9

Earthquake In Indonesia: ఇండోనేషియాలో మరోసారి భూకంపం.. సునామీ భయంతో పరుగులు తీసిన జనం

Earthquake-in-Indonesia

Earthquake-in-Indonesia

Earthquake In Indonesia: ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. అచే ప్రావిన్స్‌లో సముద్రగర్భంలో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 6.2గా అధికారులు గుర్తించారు. 49 కిలోమీటర్ల లోతులో అచే ప్రావిన్స్‌లోని తీరప్రాంత నగరమైన మీలాబోహ్‌కు దక్షిణ-నైరుతి దిశలో 40 కిలోమీటర్లు దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని వెల్లడించింది. సముద్రగర్భంలో భూకంపం రావడంతో సునామీ ముప్పు ఉందని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే, సునామీ ముప్పు లేదని అధికారులు వెల్లడిస్తున్నారు. తెల్లవారుజామున భూకంపం వచ్చినప్పుడు ప్రజలు ఇళ్ల నుండి ఎత్తైన ప్రాంతాలకు పరుగులు తీశారని, అయితే సునామీ ప్రమాదమేమీలేదని ప్రజలకు టెక్ట్స్ సందేశాలు వచ్చాయని స్థానికులు అంటున్నారు.

2004లో అచే తీరంలో సంభవించిన భారీ భూకంపం ఒక శక్తివంతమైన సునామీకి కారణమైంది. ఆ సమయంలో ఇండోనేషియాలో 2,30,000 మందిని మరణించారు.
ఇండోనేషియాలో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సునామీల వంటి విపత్తుల తరచూ జరుగుతుంటాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో.. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 25 మంది మరణించారని అక్కడి ప్రభుత్వం వివరించింది.

ఇదీ చదవండి: Mexico Earthquake: మెక్సికోలో ఒక్కసారిగా దద్దరిల్లిన భూమి… పరుగులు తీసిన ప్రజలు

Exit mobile version